‘విశ్వంభర’ (Vishwambhara) టీజర్ కి వచ్చిన ట్రోలింగ్ అందరికీ తెలిసిందే. అందులోని వీఎఫ్ఎక్స్ పై సెటైర్లు గట్టిగానే పడ్డాయి. ‘ఆదిపురుష్’(Adipurush) టీజర్ కి ఏ రేంజ్లో ట్రోలింగ్ జరిగిందో.. దానికి మించిన ట్రోలింగ్ ‘విశ్వంభర’ టీజర్ కి జరిగింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ‘రూ.150 కోట్ల బడ్జెట్ పెట్టి.. మీరు ఇచ్చే ఔట్పుట్ ఇదా?’ అంటూ క్రిటిక్స్ సైతం టీజర్ ను ఏకిపారేశారు. ఇవి దర్శక నిర్మాతల వరకు వెళ్లాయి. అందుకే జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేశారు.
వేరే కంపెనీకి వి.ఎఫ్.ఎక్స్ పనులు అప్పగించారు. ఔట్పుట్ బెటర్ గా వస్తుంది అని. ఇప్పటికీ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ వంటివి ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనేది టాక్. మరోపక్క కొన్ని ఎపిసోడ్స్ ను రీ- షూట్ కూడా చేశారట. దీంతో బడ్జెట్ మరింతగా పెరిగిందట. మొత్తంగా రూ.150 కోట్ల బడ్జెట్లో ఫినిష్ అవ్వాల్సిన ఈ సినిమా బడ్జెట్ ఫైనల్ గా రూ.225 కోట్ల వరకు అవుతున్నట్టు వినికిడి. ఇందులో కేవలం వీఎఫ్ఎక్స్ కోసమే రూ.75 కోట్లు అయినట్టు స్పష్టమవుతుంది.
‘విశ్వంభర’ అనే కాదు.. ఈ మధ్య కాలంలో ప్రతి సినిమా బడ్జెట్.. వీఎఫ్ఎక్స్ వర్క్ రూపంలో పెరిగిపోతుంది అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ‘విశ్వంభర’ బడ్జెట్ సంగతి ఎలా ఉన్నా.. ఓటీటీ డీల్ అయితే ఇంకా ఫినిష్ అవ్వలేదు. రూ.75 కోట్ల వరకు మేకర్స్ ఆశిస్తే.. రూ.65 కోట్ల వరకు మాత్రమే ఓటీటీ సంస్థలు ముందుకు వస్తున్నాయట. సినిమా బడ్జెట్ కి తగ్గట్టు బిజినెస్ జరగకపోతే.. థియేట్రికల్ బిజినెస్ పై భారం పెరుగుతుంది. అది మేటర్