ప్రముఖ కథానాయకుడు మహేష్ బాబుకు (Mahesh Babu) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. గతంలో ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా యాడ్స్ చేసిన రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల వ్యవహారంలోనే మహేష్‌కు నోటీసులు జారీ అయ్యాయని ప్రాథమిక సమాచారం. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయట.
ఈ విషయంలో ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఈడీ పేర్కొందని సమాచారం. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్‌కు యాడ్స్ చేసినందుకుగాను మహేష్ బాబు (Mahesh Babu) సుమారు 3.4 కోట్లు అందుకున్నట్లు సమాచారం. తొలుత రూ.5.9 కోట్లు పారితోషికం ఇవ్వడానికి సంస్థలు ముందుకొచ్చాయి. అందులో రూ.2.5 కోట్లు నగదు రూపంలో తీసుకున్నారు.
మిగిలింది చెక్కు రూపంలో అందుకున్నారు. ఆ రూ.2.5 కోట్ల వ్యవహారంలోనే మహేష్‌కు నోటీసులు జారీ అయ్యాయని సమాచారం. ఇదిలా ఉండగా సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్‌పై ఈడీ ఇటీవల దాడులు చేసింది. ఈ క్రమంలో రూ.3986 కోట్ల బ్యాంకు మోసం ఆరోపణలు వచ్చాయి.
సూరానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలు ఒకే భూమిని వేర్వేరు వ్యక్తులకు విక్రయించి మోసాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఆ రెండు సంస్థలకు మహేష్ బాబు ప్రచారకర్తగా ఉండి, పెట్టుబడులు పెట్టేందుకు ప్రభావం చూపించారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది. మరి విచారణలో ఏం తేలుతుందో చూడాలి.