Krithi Shetty: అందుకే శ్యామ్ సింగరాయ్ లో నటించా: కృతి శెట్టి

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో అందరినీ ఎక్కువగా ఆకట్టుంటుకుంటున్న అందమైన హీరోయిన్స్ లో కృతి శెట్టి టాప్ లో ఉంది అనే చెప్పాలి. ఉప్పెన సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా విడుదల కంటే ముందే కృతి శెట్టి కి టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రకాల ఆఫర్స్ వచ్చాయి. ఇక ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా కొంచెం కూడా టెంప్ట్ అవ్వకుండా

కృతి శెట్టి వీలైనంత వరకూ తనకు నచ్చిన పాత్రలు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటోంది ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ హవా కాస్త తగ్గడంతో ఎవరో ఒకరిద్దరు మాత్రమే ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. ఇక ఈ సమయంలో సరైన సక్సెస్ కొడితే ఈజీగా టాప్ పొజిషన్ లోకి చేరుకోవచ్చు అని ముందుకు కృతి ముందుకు సాగుతోంది అనిపిస్తోంది. అయితే శ్యామ్ సింగరాయ్ సినిమాలో అమ్మడు కాస్త గ్లామర్ డోస్ తో పాటు బోల్డ్ గా నటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక ఆ సినిమా చేయడానికి గల కారణాలు కూడా ఇటీవల కృతి శెట్టి తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. శ్యామ్ సింగరాయ్ చేయడానికి ముఖ్య కారణం సినిమాలోని కంటెంట్ అని అంతేకాకుండా సినిమా చూసిన తర్వాత యూత్ కి తన పాత్ర చాలా కనెక్ట్ అవుతుందని కూడా తెలియజేసింది. ఇక నేను చేసిన ప్రతి పాత్ర కూడా ఆడియన్స్ కి నచ్చాలి అనుకుంటాను. వారి కోసమే నేను ఈ పాత్ర కూడా చేయడం జరిగింది.

తప్పకుండా మీ అందరికీ ఈ రోల్ కొత్త ఫీల్ ను కలిగిస్తుంది. ఇందులో నా క్యారెక్టర్ గతంలో నేను చేసిన పాత్రకు ఏ మాత్రం పోలిక ఉండదు అని వివరణ ఇచ్చింది. ఇక ఈ సినిమా కంటెంయ్ చిత్ర యూనిట్ తో పాటు కృతి శెట్టి కూడా చాలా బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ భాషల్లో కూడా ఒకేసారి విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus