టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. వరుస ప్లాపుల్లో ఉన్న టైంలో దర్శకుడు కొరటాల శివ 2 హిట్లు ఇచ్చి ఆదుకున్నాడు. ‘1 నేనొక్కడినే’ ‘ఆగడు’ వంటి ప్లాపులతో సతమతమవుతున్న మహేష్ తో ‘శ్రీమంతుడు’ చేసి ఇండస్ట్రీ హిట్(నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్) ఇచ్చి ఆదుకున్నాడు కొరటాల. ఆ తర్వాత మళ్ళీ ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ వంటి ప్లాపులతో సతమవుతుంటే.. ‘భరత్ అనే నేను’ చేసి ఇంకో హిట్ ఇచ్చాడు. ‘అందరూ నన్ను సూపర్ స్టార్ అంటారు.
Mahesh Babu
కానీ నన్ను 2 సార్లు హిట్లు ఇచ్చి ఆదుకున్నాడు కొరటాల’ అంటూ మహేష్ బాబు ఒకటి రెండు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక ‘భరత్ అనే నేను’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చి బెస్ట్ విషెస్ చెప్పాడు. ఆ సినిమాకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు ‘దేవర’ రిలీజ్ అయ్యింది. కమర్షియల్ గా సేఫ్ అయ్యింది.
ఈ సినిమా విషయంలో ఫస్ట్ ట్వీట్ మహేష్ నుండి పడాలి. కానీ పడలేదు. ‘మహేష్ ఇంకా సినిమా చూడలేదేమో అందుకే ట్వీట్ వేసి ఉండడు’ అని ఇప్పటివరకు అంతా అనుకున్నారు. కొరటాలపై ఉన్న లాయాలిటీ పరంగా చూసుకుంటే.. మహేష్ కచ్చితంగా ఈపాటికే సినిమా చూసి ట్వీట్ వేయాల్సిందే. కానీ వేయలేదు అంటే..’ ‘దేవర’ మహేష్ కి నచ్చలేదేమో?’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా ఓ మాదిరిగా ఉన్నా.. గతంలో మహేష్ ట్వీట్లు వేసి పుష్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ‘దేవర’ విషయంలో అలా చేయలేదు అంటే.. ఎన్టీఆర్ పై రివేంజ్ తో కూడా అయ్యుండొచ్చు.
గతంలో ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు పోటీగా రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్.. ‘అల వైకుంఠపురములో’ సినిమాని పొగుడుతూ ట్వీట్ వేశాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ పై ఎన్టీఆర్ ట్వీట్ వేయలేదు. ఇక ‘సర్కారు వారి పాట’ సినిమా విషయంలో ఎన్టీఆర్ ట్వీట్ వేసింది లేదు. ‘బహుశా అందుకే మహేష్ ‘దేవర’ ని పట్టించుకోలేదేమో’ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.