కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల.. చాలా సినిమాల షూటింగ్లు ఆగిపోయాయి. అంతేకాదు థియేటర్లు కూడా 9నెలల పాటు మూతపడ్డాయి. ఆ కారణంగా విడుదలకు రెడీగా ఉన్న సినిమాలు విడుదల కాలేదు. అందులో కొన్నిటికి ఓటిటి నుండీ మంచి డీల్ వచ్చినప్పటికీ నిర్మాతలు ముందడుగు వెయ్యలేదు. ఇదిలా ఉండగా.. డిసెంబర్ నాటికి థియేటర్లు తెరుచుకుని.. పరిస్థితి నార్మల్ గా వస్తుంది అనుకుంటే అలా కనిపించడం లేదు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేశారు కానీ..
ఆ చిత్రానికి పెద్ద ఎత్తున ఆదరణ దక్కడం లేదు. కలెక్షన్ల పరంగా సినిమా హిట్ అంటున్నారు కానీ.. బిజినెస్ పెద్ద ఎత్తున రగకపోవడంతో అది పూర్తి స్థాయిలో హిట్ అని చెప్పలేము. బహుశా ఇందుకేనేమో.. నితిన్, అఖిల్ సినిమాలు సైలెంట్ అయిపోయాయి. నిజానికి అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, నితిన్ ‘రంగ్ దే’ చిత్రాలు 2021 సంక్రాంతికే విడుదలవుతాయని నిర్మాతలు ప్రకటించారు. కానీ ఆ దిశగా ప్రమోషన్లు పెట్టలేదు నిర్మాతలు.
అందుకు ప్రధాన కారణం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ చిత్రాలకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదట. అందుకే ఆ రెండు చిత్రాల నిర్మాతలు .. సంక్రాంతికి స్కిప్ చేసి.. సమ్మర్ కు విడుదల చెయ్యాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో నిర్మాతలు క్లారిటీ ఇస్తేనే కానీ చెప్పలేము.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!