Jr NTR: ఆ రీజన్ వల్లే తారక్ మల్టీస్టారర్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు సోలో హీరోగా సినిమాలలో నటిస్తూనే మరోవైపు మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తూ తారక్ కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే తారక్ మల్టీస్టారర్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విషయంలో ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తితో ఉన్నారు. తారక్ మల్టీస్టారర్స్ కు దూరంగా ఉండాలని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి తారక్ ప్లాన్ మరో విధంగా ఉందని తెలుస్తోంది.

ఆర్.ఆర్.ఆర్ సినిమా వల్ల కెరీర్ పరంగా ఒక సినిమాకే నాలుగేళ్ల సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వేగంగా సినిమాల్లో నటించడానికి మల్టీస్టారర్స్ బెస్ట్ ఆప్షన్ అని తారక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పాత్ర మరీ అద్భుతంగా ఉంటే మాత్రం ఈ విధంగా చేయాలని జూనియర్ ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారు. తారక్ ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలలో నటించే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించేలా తారక్ చేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా తారక్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తారక్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది. హాలీవుడ్ డైరెక్టర్లు సైతం తారక్ తో సినిమా చేయాలని ఆశ పడుతున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాస్ యాక్షన్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

తారక్ (Jr NTR) స్క్రిప్ట్ ల విషయంలో, డైరెక్టర్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తారక్ తో పని చేసిన డైరెక్టర్లకు కెరీర్ పరంగా సినిమా ఆఫర్లు అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. కెరీర్ విషయంలో తారక్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తారక్ నందమూరి ఫ్యాన్స్ లో సైతం క్రేజ్ పెరుగుతోంది. తారక్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus