నారా రోహిత్ (Nara Rohith) హీరోగా జర్నలిస్ట్ మూర్తి (Murthy Devagupthapu) డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతినిధి2 (Prathinidhi2) మూవీ మొదట ప్రకటించిన ప్రకారం ఈ నెల 25వ తేదీన విడుదల కావాల్సి ఉంది. పదేళ్ల క్రితం ఏప్రిల్ నెల 25వ తేదీన ప్రతినిధి సినిమా విడుదలై హిట్ గా నిలిచింది. ఆ సినిమాలో ప్రస్తావించిన కొన్ని అంశాల గురించి పాజిటివ్ గా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు తాజాగా విడుదలైన ప్రతినిధి2 ట్రైలర్ కు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుత రాజకీయాలపై వ్యంగ్యాస్త్రంగా ఈ సినిమా ఉండగా ట్రైలర్ రిలీజైన సమయంలో ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేసేలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని కామెంట్లు వ్యక్తమయ్యాయి. నారా రోహిత్ ఒక రాజకీయ కుటుంబానికి బంధువు కావడం వల్ల కూడా ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఈ సినిమా తీశారని కామెంట్లు వినిపించాయి. అయితే దర్శకుడు మూర్తి మాత్రం ఆ కామెంట్లలో నిజం లేదని చెప్పుకొచ్చారు.
అయితే సెన్సార్ సమస్యల వల్ల ఈ సినిమా వాయిదా పడిందని తెలుస్తోంది. కొన్నిరోజుల పాటు ఈ సినిమాను వాయిదా వేశామని త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ చెప్పారు. అయితే సినిమా వాయిదాకు ఎన్నికల కోడ్ అమలులో ఉండటం కారణమా? ఏ రాజకీయ పార్టీ ఒత్తిళ్లు అయినా కారణమా? అనే కామెంట్లు వినిపించాయి. ప్రతినిధి2 కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత ప్రమోషన్స్ లో వాయిదా వెనుక అసలు కారణాలు తెలిసే అవకాశాలు ఉంటాయి.
ప్రతినిధి2 హిట్టైతే నారా రోహిత్ కెరీర్ పరంగా బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. ఎన్నికల ఫలితాలు విడుదలైన ఈ సినిమా విడుదలవుతుందో లేక ఎన్నికలకు ముందే ఈ సినిమా విడుదలవుతుందో తెలియాల్సి ఉంది. ప్రతినిధి2 మూవీ ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిందని తెలుస్తోంది. ప్రతినిధి2 సక్సెస్ కావడం దర్శకుడు మూర్తి కెరీర్ కు కీలకం కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.