Rajamouli: జక్కన్న హాలీవుడ్ సినిమా తీయకపోవడానికి కారణమిదేనా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ప్రస్తుతం దేశంలోని టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. జక్కన్న సినిమాల నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే జక్కన్న హాలీవుడ్ సినిమాలను డైరెక్ట్ చేస్తే బాగుంటుందని కొంతమంది భావిస్తున్నారు. అయితే జక్కన్న హాలీవుడ్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దర్శకుడు హాలీవుడ్ లో సినిమాలను తీయాలని అనుకుంటారని జక్కన్న అన్నారు.

నాకు కూడా ఆ కల ఉందని జక్కన్న పేర్కొన్నారు. నాకు ప్రయోగాలు చేయడం ఎప్పటికీ ఇష్టమేనని రాజమౌళి వెల్లడించారు. అయితే టాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం వహించడం విషయంలో సృజనాత్మక స్వేచ్ఛ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రీజన్ వల్లే హాలీవుడ్ ఎంట్రీ విషయంలో ఒకింత కన్ఫ్యూజ్ అవుతున్నానని రాజమౌళి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇండియాలో నేనే డిక్టేటర్ నని సినిమా ఎలా తీయాలో నాకు ఎవరూ చెప్పరని రాజమౌళి కామెంట్లు చేశారు.

హాలీవుడ్ సినిమాను చేస్తే నా గుర్తింపు డబుల్ అవుతుందని జక్కన్న చెప్పుకొచ్చారు. జక్కన్న చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. రాజమౌళి ప్రస్తుతం 100 కోట్ల రూపాయల నుంచి 120 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. స్టార్ ప్రొడ్యూసర్లలో చాలామంది రాజమౌళి డైరెక్షన్ లో సినిమాలు నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

రాజమౌళి సినిమాలు మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జక్కన్న క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. జక్కన్న కెరీర్ విషయంలో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహేష్ జక్కన్న కాంబో మూవీపై అంచనాలు నెలకొన్నాయి. 2026లో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus