సినిమా రంగంలో హీరోగా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా సీనియర్ ఎన్టీఆర్ ప్రతిభను చాటుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి క్రమశిక్షణ నేర్పిన నటుడిగా సీనియర్ ఎన్టీఆర్ కు పేరుంది. రాముడు, కృష్ణుడు పాత్రలతో పాటు రావణుడి పాత్రలో కూడా సీనియర్ ఎన్టీఆర్ నటించారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో సమయాన్ని పట్టించుకోకుండా సీనియర్ ఎన్టీఆర్ ఎక్కువ సినిమాల్లో నటించారు. సీనియర్ ఎన్టీఆర్ మూడు షిఫ్టులలో పని చేసిన రోజులు కూడా ఉన్నాయి.
అయితే ఆ తర్వాత రోజుకు రెండు షిఫ్ట్ లు మాత్రమే చేయాలని సీనియర్ ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కాలంలో సాయంత్రం ఆరు గంటల తర్వాత పని చేయకూడదని ఎన్టీఆర్ నిబంధన పెట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల గురించి వింటే ఆ అలవాట్లు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఉదయం సమయంలో ఎన్టీఅర్ అరచేతి మందంలో ఉండే 20కు పైగా ఇడ్లీలను సులువుగా తినేవారు. ఉదయాన్నే మేకప్ వేసుకుని ఎన్టీఆర్ నిర్మాతతో కలిసి షూటింగ్ స్పాట్ కు వెళ్లేవారు.
షాట్ గ్యాప్ లో ఆపిల్ జ్యూస్ తాగడానికి సీనియర్ ఎన్టీఆర్ ఇష్టపడేవారు. రోజుకు ఐదు బాటిళ్ల ఆపిల్ జ్యూస్ ను ఎన్టీఆర్ తాగేవారు. సాయంత్రం బజ్జీలు, డ్రై ఫ్రూట్స్ తినడానికి ఎన్టీఆర్ ఇష్టపడేవారు. ప్రతిరోజూ రెండు లీటర్ల బాదంపాలను ఎన్టీఆర్ తాగేవారు. సమ్మర్ లో మాత్రం లంచ్ సమయంలో మామిడికాయల జ్యూస్ తాగేవారు. మామిడి పళ్ల రసంలో గ్లూకోజ్ పౌడర్ కలుపుకుని సీనియర్ ఎన్టీఆర్ తాగేవారు. వైద్యుల సలహా మేరకు కొంతకాలం పాటు అల్లం వెల్లుల్లి ముద్దను సీనియర్ ఎన్టీఆర్ తీసుకునేవారు.
ఎంత ఆహారాన్ని తీసుకున్నా హరాయించుకునే శరీరం కావడంతో సీనియర్ ఎన్టీఆర్ తీసుకునే అహారం విషయంలో నియమాలు పెట్టుకునేవారు కాదు. సీనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో 300కు పైగా సినిమాలలో నటించారు. సినిమాలకు తక్కువ మొత్తాన్నే ఎన్టీఆర్ పారితోషికంగా తీసుకునేవారు. వేగంగా సినిమా షూటింగ్ లు పూర్తయ్యేలా ఎన్టీఆర్ తగిన జాగ్రత్తలు తీసుకునేవారు.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!