సినిమా పరిశ్రమలో ముందుగా ఓ హీరో, దర్శకుడు కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ చేయాలనుకుని.. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. అధికారికంగా ప్రకటించి.. ఆ తర్వాత పలు కారణాల వల్ల ప్రాజెక్టులు నిలిపేయడం.. లేదా కొంత భాగం చిత్రీకరించిన తర్వాత అప్పటికే కోట్లలో నష్టపోవడం అనే సంఘటనలు చాలానే జరిగాయి.. అలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో రెండు సినిమాలు నిలిచిపోయాయి.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. కొరటాల శివ – రామ్ చరణ్ కాంబినేషన్‌లో బండ్ల గణేష్ నిర్మాతగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.
పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. బయటకు చెప్పలేదు కానీ పలు కారణాలతో ఆ మూవీ ఆపేశారు.. తర్వాత మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ ఇద్దరితో ‘ఆచార్య’ డైరెక్ట్ చేశాడు కొరటాల.. ఇది అందరికీ తెలిసిందే.. అంతకుముందే చెర్రీ నటించాల్సిన మరో మూవీ కొంతమేర షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు ధరణి ‘బంగారం’ అనే సినిమా తీశాడు. అనుకున్నంతగా ఆడకపోయినా మెగా ఫ్యామిలీ నుండి మరో క్రేజీ ఆఫర్ వరించింది అతగాడికి..
సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ మీద అగ్రనిర్మాత ఆర్.బి. చౌదరి సమర్పణలో తిరుపతికి చెందిన ఎన్వీ ప్రసాద్ నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా క్రేజీ ఫిలిం అనౌన్స్ చేశారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్.. గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. టైటిల్ ‘మెరుపు’.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ.. ఫుట్ బాల్ కోచ్‌గా బాలీవుడ్ పాపులర్ యాక్టర్ నానా పటేకర్‌ను కూడా ఫైనల్ చేశారు. చెన్నైలో మూడున్నర కోట్లతో ఓ పాట తీశారు. తర్వాత ఇంకా కొన్ని సీన్లకు ఇంకొన్ని కోట్లు ఖర్చు పెట్టారట.
ఈ లెక్కన సినిమా తీస్తే మొత్తం మీద రూ. 40 కోట్ల భారీ బడ్జెట్ అవుతుందని నిర్మాతలు అంచానకు వచ్చేశారు. అంత పెడితే వర్కౌట్ కాదని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే అంతకుముందు ‘ఆరెంజ్’ కి బీభత్సమైన బడ్జెట్ పెట్టడం వల్ల అంతే భారీ నష్టాలు వచ్చిన సంఘటనలు గుర్తొచ్చాయి. దీంతో మార్కెట్‌ని మించి ఖర్చు పెట్టడం కంటే సినిమాని ఆపెయ్యడమే బెటర్ అని పక్కన పెట్టేశారు. బాబాయ్ పవన్‌కి హిట్, అబ్బాయ్ చరణ్‌కి సరైన సినిమా ఇవ్వలేకపోయిన డైరెక్టర్ ధరణి మళ్లీ టాలీవుడ్‌లో కనిపించలేదు..