Ravi Teja: ‘వాల్తేరు వీరయ్య’ లో రవితేజ పాత్ర వెనుక అంత కథ ఉందా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం జనవరి 13న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తున్న మూవీ ఇదే అని చెప్పాలి. ఆ తర్వాత బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ మూవీ ఉంది. ఇదిలా ఉండగా.. ఈ రెండు సినిమాల్లోనూ ఓ కామన్ పాయింట్ ఉంది. ‘వీరసింహారెడ్డి’ సినిమా అనేది సవతి తల్లికి పుట్టిన కూతురు కథాంశంతో రన్ అవుతుంది.

‘వాల్తేరు వీరయ్య’ లో సవతి తల్లికి పుట్టిన కొడుకు కథాంశంతో రూపొందుతుంది. విచిత్రంగా ఈ రెండు సినిమాలను నిర్మించింది ఒకే బ్యానర్ కావడం విశేషం. ప్రస్తుతానికి మనం ‘వాల్తేరు వీరయ్య’ గురించి మాట్లాడుకుందాం. ఇందులో సవతి తల్లికి పుట్టిన కొడుకుగా రవితేజ నటించాడు. చిరంజీవికి తమ్ముడి పాత్ర అనమాట. ప్రమోషన్లలో చిరంజీవి చెప్పినట్టు రవితేజ పాత్ర కనుక లేకపోతే ఈ సినిమా లేదనే చెప్పాలి. చాలా పవర్ ఫుల్ గా ఆ పాత్రను డిజైన్ చేశాడు దర్శకుడు బాబీ.

అలాగే చిరు.. ఓ సన్నివేశంలో రవితేజ పోస్టర్ పై బురద పడితే తన లుంగీతో తుడుచుకుంటూ ఎమోషనల్ అవుతాడు.సో రవితేజ పాత్రలో పవన్ కళ్యాణ్ ఉండి ఉంటే ఇంకా బాగుండేది అంటూ మెగా అభిమానులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నిజానికి రవితేజ పాత్రను దర్శకుడు బాబీ పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకునే రాశాడట. ఆల్రెడీ పవన్ తో కలిసి పనిచేసిన అనుభవం బాబీకి ఉంది. ఇక చిరుకి ఎలాగూ వీరాభిమాని.

పవన్ ఎలాగూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పాత్ర చేయలేడు కాబట్టి.. రవితేజని ఫిక్స్ అయిపోయాడట బాబీ. చిరు- రవితేజ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల్లో.. పవన్ ను దృష్టిలో పెట్టుకునే చిరుకి సీన్ వివరించేవాడట బాబీ. అందుకే చిరు – రవితేజ ల మధ్య వచ్చే సన్నివేశాలు అంత బాగా వచ్చాయి. ఇక రవితేజ.. గతంలో చిరుకి తమ్ముడిగా అన్నయ్య సినిమాలో నటించాడు. కాబట్టి.. అతనికి కూడా విక్రమ్ సాగర్ పాత్ర చేయడం ఈజీ అయిపోయిందని తెలుస్తుంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus