బిగ్ బాస్ హౌస్ లో శోభాశెట్టి ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ కి మంచి సంతోషాన్ని కలిగించింది. అయితే, శోభాశెట్టిని టాప్ 5కి పంపించకుండా ఎందుకు ఎలిమినేట్ చేశారు. అసలు నిజంగానే శోభాశెట్టి ఓటింగ్ లో లీస్ట్ లో ఉందా ? ఎందుకు బిగ్ బాస్ ఇక్కడి వరకూ శోభాని తీస్కుని వచ్చాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఆదివారం ఎపిసోడ్ లో చాలా కూల్ గా గేమ్స్ ఆడించిన నాగార్జున ఫైనలిస్ట్ లని ఎనౌన్స్ చేశాడు.
అర్జున్ ఆల్రెడీ టిక్కెట్ టు ఫినాలే కాబట్టి అర్జున్ నేరుగా ఫినాలేకి వెళ్లాడు. ఆతర్వాత ప్రియాంకని ఫైనలిస్ట్ గా ఎనౌన్స్ చేశాడు. తర్వాత యావర్, తర్వాత అమర్ దీప్, తర్వాత పల్లవి ప్రశాంత్ ఆ తర్వాత శివాజీ ఇంకా శోభాలని లాస్ట్ వరకూ ఉంచాడు. ఇద్దరికీ థంబోలా టిక్కెట్స్ ఇస్తూ స్టేజ్ పైన నెంబర్స్ ని తీశాడు నాగార్జున. లాస్ట్ వరకూ చాలా టెన్షన్ పెట్టి శోభాని ఎలిమినేట్ చేశారు. ఈ ఎలిమినేషన్ ని ముందుగానే ఊహించిన శోబాశెట్టి బాగా ప్రిపేర్ అయ్యింది.
అందరికీ వీడ్కోలు చెప్తూ, తను తప్పులు ఏమైనా చేసి ఉంటే క్షమించమని, ఈ బిగ్ బాస్ అనేది నా జీవితంలో మరపురాని జెర్నీగా మిగిలిపోతుందని అందరికీ చెప్పి వీడ్కోలు పలికింది. అంతేకాదు, శివాజీ కాళ్లకి మొక్కి బ్లెస్సింగ్స్ తీస్కుంటూ ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని చెప్పింది. అర్జున్ తో వెళ్లిపోతూ బాగా గేమ్ ఆడమని చెప్పి, నీకు బయట ఓటింగ్ పెరిగిలా నేను చేస్తానని ప్రామిస్ చేస్తూ వచ్చింది. స్టేజ్ పైకి వచ్చిన శోభాశెట్టి చాలా బాధగా కన్నీటి పర్యంతం అయ్యింది.
లాస్ట్ వరకూ ఉంటే హౌస్ లో బాగుండేదని బాధపడింది. తన జెర్నీ చూస్కుంటూ వాళ్ల మదర్ ని హౌస్ లో చూసేసరికి ఎమోషనల్ అయిపోయింది. స్టేజ్ పైనే కూర్చుండిపోయింది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం శోభ ఎలిమినేట్ అయినందుకు అందరూ హ్యాపీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు శోభని కావాలనే ఇప్పుడు బయటకి పంపించారని, ఆమె ఓటింగ్ ని సీరియల్ బ్యాచ్ కి సపోర్ట్ గా ఉపయోగించబోతున్నారని, ఇదే బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక స్టేజ్ పైన శోభాశెట్టి హౌస్ మేట్స్ లో (Bigg Boss 7 Telugu) గుడ్ క్వాలిటీ బ్యాడ్ క్వాలిటీ చెప్తూ అందరికీ బైబై చెప్పేసింది. అర్జున్ కి మాత్రం బోటమ్ 2లో ఉన్నావని బాధపడద్దని చివరి వరకూ ఫైట్ చేయమని చెప్పింది. అమర్ ని అయితే కప్ తీస్కుని బయటకి రమ్మని , అనంతపురం లో సెలబ్రేషన్ అవ్వాలని కప్ తో ఊరికి వెళ్దాం అంటూ భరోసా ఇచ్చింది. శోభాశెట్టి బయటకి వచ్చాక మరి తనపై వచ్చిన ట్రోలింగ్స్, నెగిటివిటీని చూసి ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.