అక్కలు స్టార్ హీరోయిన్లు అయితే వాళ్ళ పేర్లు చెప్పుకొని హీరోయిన్లుగా పరిచయమైన చెల్లెల్లు కూడా టాలీవుడ్లో చాలా మంది ఉన్నారు. మరోపక్క స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతున్న తరుణంలో సూసైడ్ చేసుకునో లేక దురదృష్టవశాత్తునో, ప్రమాదవశాత్తునో మరణించిన వారు కూడా ఉన్నారు. ఈ రెండు కేటగిరీలకు చెందిన వారిలో సిమ్రాన్ చెల్లెలు కూడా ఒకరు. సిమ్రాన్ కు ముగ్గురు చెల్లెల్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో రాథామోనాల్ నావల్ అలియాస్ మోనాల్ నావల్ ఒకరు.
సిమ్రాన్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెళుతున్న తరుణంలో ఆమె పేరును ఒక ఐడెంటిటీగా మాత్రమే వాడుకుని ఇండస్ట్రీలో అడుగు పెట్టింది మోనాల్ నావల్. హీరోయిన్ గా పరిచయమవ్వడానికి ముందు ఈమె ఓ మోడల్. పలు ష్యాషన్ షోలలో కూడా పాల్గొంది. మిస్ బాంబే కిరీటాన్ని గెలుచుకున్న చరిత్ర కూడా ఈమెకు ఉంది. 18 ఏళ్ల వయసులోనే ‘ఇంద్ర ధనుష్’ అనే కన్నడ చిత్రంతోనే ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2000వ సంవత్సరంలో వచ్చిన ఈ మూవీ సో సో గానే ఆడింది.
అటు తర్వాత విజయ్ హీరోగా వచ్చిన ‘ బద్రి’ లో హీరోయిన్‌గా చేసింది. అటు తర్వాత పార్వయ్ ఒండ్రే పోదుమే, లవ్‌లి, సుముదిరం వంటి వరుస సినిమాల్లో ఈమె నటించింది. ‘ఇష్టం’ అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి టాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో ‘మా తుఘే సలామ్’ వంటి సినిమాలో నటించింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా మోనాల్ 2002 ఏప్రిల్ 14న చెన్నైలోని తన నివాసంలో ఉన్న గదిలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది.
అయితే ఈమె ఎలాంటి సూసైడ్ నోటు రాసింది లేదు. ఈ క్రమంలో తన చెల్లెలు మరణానికి కారణం కొరియోగ్రాఫర్ ప్రసన్న సుజితేనని సిమ్రాన్ ఆరోపించి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రేమ, పెళ్లి అంటూ తన చెల్లెల్ని మోసం చేయడం వల్లనే ఆమె ప్రాణాలు తీసుకుందని సిమ్రాన్ తెలిపింది. అయితే వీటికి ఆధారాలు ఏమీ లేకపోవడంతో సిమ్రాన్ ఆరోపణలు చెల్లలేదు. మోనాల్ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.
Most Recommended Video
సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?