యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో దేవర పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మధ్యనే గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుంది. మొదటి భాగం దేవర పార్ట్ 1 గా రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే.. దేవర మొదటి భాగాన్ని ఏప్రిల్ 5 న విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.
కానీ ఆ డేట్ కి దేవర పార్ట్ 1 రావడం లేదు అని.. పోస్ట్ పోన్ అయ్యింది అనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో దిల్ రాజు తన ఫ్యామిలీ స్టార్ ను ఏప్రిల్ 5 కి తీసుకురావాలని డిసైడ్ అయ్యి అధికారిక ప్రకటన చేశారు. కానీ దేవర టీం తమ సినిమా పోస్ట్ పోన్ అయినట్టు వెంటనే ప్రకటించలేదు. కానీ ఈరోజు అదే నిజం అని క్లారిటీ ఇచ్చారు.
అక్టోబర్ 10 న దేవర రిలీజ్ కాబోతున్నట్టు ఒక పోస్టర్ ద్వారా దేవర యూనిట్ కన్ఫర్మ్ చేసింది. అయితే అక్టోబర్ 10, 11 డేట్లకి దిల్ రాజు తన గేమ్ ఛేంజర్ సినిమాని విడుదల చేయాలని అనుకున్నారు. దసరా శెలవులు ఉండటం వల్ల అది గేమ్ ఛేంజర్ కి మంచి రిలీజ్ డేట్ అనుకున్నారు.
కానీ దేవర (Devara) కోసం ఫిక్స్ చేసుకున్న ఏప్రిల్ 5 డేట్ ని దిల్ రాజు సినిమా కోసం ఇవ్వడంతో, అక్టోబర్ 10, 11 డేట్.. లకి గేమ్ ఛేంజర్ ని తప్పించినట్టు తెలుస్తుంది. ఆ సినిమా షూటింగ్ కనుక అనుకున్న టైమ్ కి కంప్లీట్ అయితే .. ఇంకా ముందుగా రిలీజ్ చేసే ఛాన్స్.. లు ఉంటాయి. ఏది ఏమైనా దేవర కి మంచి రిలీజ్ డేట్ దొరికింది అనే చెప్పాలి