మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రాన్ని ముందుగా మే 13న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఆగష్టులో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యబోతున్నట్టు వార్తలు మొదలయ్యాయి.కరోనా తీవ్రత ఎక్కువయ్యింది కాబట్టి.. ఈ పరిస్థితుల్లో సినిమా విడుదల వాయిదా వెయ్యడం పెద్ద విషయం కాదని అభిమానులు ఈ అనౌన్స్మెంట్ తో పెద్దగా నిరుత్సాహపడలేదు. అయితే రిలీజ్ డేట్ చేంజ్ వెనుక వేరే కారణం కూడా ఉందని ఇన్సైడ్ టాక్.
నిజానికి ‘ఆచార్య’ చిత్రానికి సంబంధించిన సీజీ వర్క్ ఏమాత్రం పూర్తికాలేదట. ఇది గత కొద్ది రోజుల నుండీ ప్రచారంలో ఉన్నదే..!అనుకున్న టైంకు సీజీ వర్క్ పనులు పూర్తవుతాయా లేదా అనే అనుమానాలు కూడా ఎక్కువగా వినిపించాయి.దాంతో పాటు ఇంకా ప్యాచ్ వర్క్ కూడా బ్యాలెన్స్ ఉందని వినికిడి. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ కు కరోనా వచ్చిందని రాంచరణ్.. తన పార్ట్ షూటింగ్ ను ఆపేసి మరీ వచ్చేసాడు. ఆ వర్క్ కూడా బ్యాలన్స్ ఉంది.
అది సాంగ్ చిత్రీకరణ అని సమాచారం.ఇవన్నీ కంప్లీట్ చెయ్యాలి అంటే జూన్ నెలాఖరు వరకూ టైం పడుతుందట.కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ లేకపోయినా ఈ సినిమా గ్యారెంటీగా వాయిదా పడేదని ఇండస్ట్రీ టాక్. ఈ కారణాలు ఎలా ఉన్నా.. ‘ఆచార్య’ కు బాగా కలిసొచ్చినట్టు అయ్యింది. అలా అని ఆగష్టు నెలలో కూడా ఈ చిత్రం విడుదలవుతుంది అని గ్యారెంటీ ఏమీ లేదు..!