మరో కాళభైరవుడిని చూపించబోతున్నాడా..?

ట్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ మరో ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టాడు. తమిళ క్రేజీ డైరెక్టర్ శంకర్ తో కలిసి సినిమా చేయడం ఇద్దరి కాంబినేషన్ కుదరడం అనేది ఇప్పుడు ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తోంది. రామ్ చరణ్ శంకర్ తో ప్రాజెక్ట్ అని ఎప్పుడ్నుంచో న్యూస్ వినిపిస్తున్నా అఫీషియల్ గా కన్ఫార్మ్ చేసేవరకూ ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో త్వరలో ఈసినిమా సెట్స్ పైకి వెళ్లబోతోందని తెలియగానే ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమా ఏ జోనర్ లో ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.

ఫిల్మీ ఫోకస్ కి ఎక్స్ క్లూజివ్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఇది ఒక యాక్షన్ సినిమాగా ఉండబోతోందని చెప్తున్నారు. శంకర్ మార్క్ ఉంటూనే సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండే యాక్షన్ సినిమాగా దీన్ని తెరకెక్కించబోతున్నారని టాక్. నిజానికి చాలామంది ఇది చారిత్రాత్మకమైన సినిమా అనే అనుకున్నారు. మరోసారి కాళభైరవుడిగా మగధీరుడిగా రామ్ చరణ్ ని శంకర్ చూపించబోతున్నాడని కోలీవుడ్ లో వార్తలు వచ్చేస్తున్నాయి. కానీ, గతంలో దిల్ రాజు తన బ్యానర్ లో భారతీయుడు 2 సినిమా తీద్దామనుకుని ఎక్కువ బడ్జెట్ అవుతుందని ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ పై చారిత్రాత్మకమైన సినిమా చేయాలి అంటే ఖచ్చితంగా భారీ బడ్జెట్ అవుతుంది.

కాబట్టి, దిల్ రాజు లిమిట్స్ లోనే ఈసినిమా ఉంటుందని టాక్. శంకర్ రెండు భాషల్లో ఈ సినిమాని ఒకేసారి తెరక్కిస్తున్నారట. తెలుగు, తమిళంలో ఒకేసారి తీసే ఆలోచనలో ఉన్నారు. అలాగే ట్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ కి ప్యాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ఉంటుంది కాబట్టి మిగతా భాషల్లో కూడా దీన్ని రిలీజ్ చేస్తారట. ఈ సినిమాకి పనిచేసే టెక్నీషియన్స్ , స్టార్ కాస్టింగ్ వివరాలు త్వరలోనే అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలోనే ఈసినిమా సెట్స్ పైకి వెళ్తుందని చెప్తున్నారు. మొత్తానికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనేది ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తోంది.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus