2016 లో ఎటువంటి చప్పుడు చేయకుండా వచ్చిన ‘బిచ్చగాడు’ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన సినిమా ఇది. అంతకు ముందు ‘నకిలీ’ ‘డా సలీం’ అనే చిత్రాలు చేశాడు. ఆ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘బిచ్చగాడు’ బ్లాక్ బస్టర్ తో విజయ్ ఆంటోనీ కి మంచి మార్కెట్ ఏర్పడింది. దాన్ని ప్రతిసారి క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేశాడు. అయితే తర్వాత అతను చేసిన సినిమాలు అన్నీ పెద్ద ప్లాప్ అయ్యాయి.
ఇక అతని పని అయిపోయింది అనుకున్న టైంలో (Bichagadu2) ‘బిచ్చగాడు’ క్రేజ్ ను వాడుకున్నాడు. ‘బిచ్చగాడు’ కి సీక్వెల్ గా వచ్చిన ‘బిచ్చగాడు 2 ‘ మే 19 న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి హీరో, దర్శకుడు, ఎడిటర్, సంగీతం, నిర్మాత.. అన్నీ విజయ్ ఆంటోనీనే.! తమిళంలో తప్ప ఈ సినిమాకి తెలుగులో పెద్దగా ప్రమోషన్ చేసింది లేదు. మొదటి రోజు రివ్యూలు కూడా సో సో గానీ వచ్చాయి. కానీ బాక్సాఫీసు దగ్గర మాత్రం ఓపెనింగ్స్ భారీగా నమోదయ్యాయి.
వీకెండ్ ముగిసేసరికి 90 శాతం రికవరీ సాధించింది. సోమవారం కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అయిపోయింది. తమిళంలో మళ్ళీ అంత హవా లేదు. అలా అని అక్కడి కూడా నష్టాలు ఏమీ రాలేదు. తెలుగులో అయితే లాభాలు కాస్త ఎక్కువగా వస్తున్నాయి. ‘బిచ్చగాడు 2 ‘ సక్సెస్ లో ఎవ్వరి కష్టము లేదు. కేవలం ‘బిచ్చగాడు’ పై జనాలకు ఉన్న ఇష్టం తప్ప. అందుకే ‘బిచ్చగాడు 3 ‘ కూడా తీయడానికి విజయ్ ఆంటోనీ రెడీ అయిపోయాడు.