దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సృష్టించిన బాహుబలి చిత్రానికి సమాంతరంగా వస్తున్న యానిమేషన్ సిరీస్ “ది స్వార్డ్ ఆఫ్ బాహుబలి” తుది రూపుదిద్దుకుంటోంది. జక్కన్న ఓ వైపు బాహుబలి కంక్లూజన్ వీఎఫ్ ఎక్స్ వర్క్ లో బిజీగా ఉంటూనే మరో వైపు “ది స్వార్డ్ ఆఫ్ బాహుబలి” వర్చువల్ రియాలిటీ (వీఆర్) అనుభూతిని అభిమానులకు పంచడానికి సిద్ధమయ్యారు. బాహుబలి బృందం రేపటి నుంచి (బుధవారం) హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో “ది స్వార్డ్ ఆఫ్ బాహుబలి” వర్చువల్ రియాలిటీ టీజర్ ని చూసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇక్కడికి వచ్చిన సినీ ప్రేక్షకులు ఈ టీజర్ ని చూసి ఆనందించవచ్చు.
ఈ టీజర్ కి బెంగళూర్, గోవా ప్రాంతాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అద్భుతంగా ఉందని బాహుబలి అభిమానులు కితాబు ఇచ్చారు. ఇక రేపటి నుంచి హైదరాబాదీలు కూడా ఆ అనుభూతిని ఆస్వాదించనున్నారు. ఈనెల 13 వరకు ఇది అందుబాటులో ఉంటుందని బాహుబలి బృందం సోషల్ మీడియాలో వెల్లడించింది. “ది స్వార్డ్ ఆఫ్ బాహుబలి” సిరీస్ ని త్వరలో యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు. విడుదల చేసే తేదీని అధికారికంగా ప్రకటించలేదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.