ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ సెప్టెంబర్ నెల 28వ తేదీనే థియేటర్లలో విడుదల కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా మూడు నెలల పాటు పోస్ట్ పోన్ అయింది. నాన్ థియేట్రికల్ హక్కుల డీల్ ఆలస్యం కావడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వల్ల ఈ సినిమా అంతకంతకూ ఆలస్యమవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించే ఛాన్స్ అయితే ఉంది.
అయితే సలార్ మూవీని సెప్టెంబర్ 28వ తేదీన ప్రకటించిన సమయంలో ఈ సినిమాకు పోటీగా ది వ్యాక్సిన్ వార్ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ది వ్యాక్సిన్ వార్ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందేమోనని ఫ్యాన్స్ భావించడం గమనార్హం. అయితే ది వ్యాక్సిన్ వార్ సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా అసలు లెక్కలు వెల్లడయ్యాయి. బుధవారం రోజున ఈ సినిమాకు సంబంధించి కేవలం 17 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.
17 టికెట్లు అంటే ఈ రికార్డ్ ఒక చెత్త రికార్డ్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ సినిమా డిజాస్టర్లకే డిజాస్టర్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి. ది వ్యాక్సిన్ వార్ డైరెక్టర్ ఇకనైనా వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ది వ్యాక్సిన్ వార్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.
వివేక్ అగ్నిహోత్రి ఇకనైనా మారాల్సిన అవసరం ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. వివేక్ అగ్నిహోత్రి తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ గురించి విమర్శలు చేయడం వల్లే ది వ్యాక్సిన్ వార్ (The Vaccine War) మరింత నష్టపోయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.