మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో మొదటిసారి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చేసిన మూవీ ‘ఇంద్ర’. బి.గోపాల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2002 వ సంవత్సరం జూలై 24న విడుదలైన ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రె హీరోయిన్లుగా నటించారు. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 18 ఏళ్లు క్రితం విడుదలైన ఈ చిత్రం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు అంటే…
ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అలాంటివి మరి. ఇంద్రసేనా రెడ్డిగా చిరు చెప్పే డైలాగ్స్ ను ఇప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉంటారు ప్రేక్షకులు. ఆ రోజుల్లోనే రూ. 38 కోట్ల షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మూవీ ఇది. అంతేకాదు అత్యధికంగా 127 కేంద్రాలలో 100 రోజులు ఆలాగే 35 కేంద్రాలలో 175 రోజులు ఆడిన ఘనత ‘ఇంద్ర’ సినిమాది. ఈ సినిమాకి ముందు చిరంజీవికి వరుస ప్లాపులు పడ్డాయి.
దాంతో ఈయన పని అయిపోయింది అనుకున్నారు కొంతమంది ప్రేక్షకులు. వాళ్ళ కామెంట్లకు ఫుల్ స్టాప్ పెట్టిన మూవీ ఇది. ఈ చిత్రం క్రియేట్ చేసిన మరో రికార్డు గురించి చెబితే ఎవ్వరైనా షాక్ అవుతారు.అదేంటంటే.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన వన్ అండ్ ఓన్లీ తెలుగు మూవీ ‘ఇంద్ర’. అప్పటిరోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లకు పైగా ‘ఇంద్ర’ టికెట్లు అమ్ముడయ్యాయట.