Bigg Boss Telugu 6: నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్..! సండే ఎపిసోడ్ ఎఫెక్ట్..!

బిగ్ బాస్ హౌస్ లో సండే అంటే ఫన్ డే అని, ఎలిమినేషన్ డే అని హోస్ట్ నాగార్జున ఎప్పుడు చెప్తుంటారు. అన్నట్లుగానే మిగిలిన 10మందితో ఫన్ గేమ్స్ ఆడిస్తూ ఒక్కొక్కరిని సేవ్ చేశారు. చివర్లో శ్రీసత్య, మెరీనా, ఇంకా ఇనాయా ఉన్నప్పుడు హౌస్ మేట్స్ అందరూ శ్రీసత్య వెళ్లిపోతోందేమో అని అనుకున్నారు. కానీ, మెరీనా హౌస్ నుంచీ ఎలిమినేట్ అయిపోయింది. రోహిత్ – మెరీనా ఇద్దరూ జంటగా ఇంట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జంటగానే ఎలిమినేట్ అవుతారని ఊహించారు.

కానీ, రోహిత్ ఇంకా గేమ్ లో ఉన్నాడు. ఈవిషయం పక్కనబెడితే, నాగార్జున హౌస్ మేట్స్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మరీ ఉన్న 10మందిలో బోటమ్ లో ఉండే 5గురు ఎవరో చెప్పమని చెప్పాడు. మెజారిటీ గా అందరూ మెరీనా పేరే చెప్పారు. ఊహించినట్లుగానే మెరీనా ఎలిమినేట్ అయిపోయింది. ఇక హౌస్ లో ప్రస్తుతం 9మంది మాత్రమే మిగిలారు. హౌస్ మేట్స్ మెజారిటీ ఓటింగ్ ని బట్టీ చూస్తే టాప్ – 5లో ఉండేవాళ్లు ఎవరంటే.,రేవంత్ కి ప్రతి హౌస్ మేట్ టాప్ 5 ప్లేస్ ఇచ్చారు.

అలాగే, శ్రీహాన్ కి కూడా మెజిరీట ఓటింగ్స్ పడ్డాయి. ఇంకా ఆదిరెడ్డి, శ్రీసత్య , ఫైమా లకి ఓటింగ్ బాగా పడింది. దీంతో వీళ్లు టాప్ 5లో ఉండచ్చని హౌస్ మేట్స్ అంచనా వేశారు. అయితే, దీనికి భిన్నంగా సోషల్ మీడియాలో టాప్ 5 వీళ్లే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం, అలాగే వాళ్ల కామెట్స్ ప్రకారం చూస్తే టాప్ 5లో ఇనాయా , కీర్తిలు ఉన్నారు. శ్రీసత్య, ఫైమాలు లేరు. అలాగే ఆదిరెడ్డి ప్లేస్ లో రోహిత్ ని పెడుతున్నారు.

ఆడియన్స్ టాప్ 1 నుంచీ టాప్ 5 వరకూ ఓటింగ్ ద్వారా చూస్తూ చెప్తున్నారు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో ప్రస్తుతం ఉన్నవారిలో అన్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం చూస్తే రేవంత్, ఇనాయా, కీర్తి, శ్రీహాన్, రోహిత్ ఉన్నారు. ఇక్కడే రోహిత్ లేదా ఆదిరెడ్డి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆదిరెడ్డికి శనివారం నాగార్జున క్లాస్ పీకడం అనేది ఆదిరెడ్డి ఫాలోవర్స్ కి నచ్చలేదు. దీంతో వాళ్లు వచ్చేవారం ఓట్లు గుద్దే అవకాశం కనిపిస్తోంది. మరి ఈసారి నామినేషన్స్ లో ఆదిరెడ్డిని హౌస్ మేట్స్ టార్గెట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడనే అంటున్నారు. అదీ మేటర్.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus