Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » టాలీవుడ్‌పై థియేటర్‌ ఓనర్ల పిడుగు.. మేం షోస్‌ వేయలేం అంటూ..!

టాలీవుడ్‌పై థియేటర్‌ ఓనర్ల పిడుగు.. మేం షోస్‌ వేయలేం అంటూ..!

  • May 19, 2025 / 01:15 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్‌పై థియేటర్‌ ఓనర్ల పిడుగు.. మేం షోస్‌ వేయలేం అంటూ..!

తెలుగు సినిమా ప్రేక్షకులు గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్న రోజు వచ్చేసింది.. వారి మీద పెద్ద పిడుగు వేసి వెళ్లిపోయింది. అదే సినిమా థియేటర్ల బంద్‌. అవును గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు తగ్గట్టుగానే సింగిల్‌ థియేటర్ల (Theaters) యాజమాన్యాలు టాలీవుడ్‌పై పిడుగు వేశాయి. అద్దె తరహాలో సినిమాలు వేయడం మా వల్ల కాదని, పర్సెంటేజీ ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పేశాయి. లేకపోతే జూన్‌ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్‌ నిర్వహిస్తామని స్పష్టం చేసేశాయి.

Theaters

ఆదివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో దిల్ రాజు (Dil Raju), సురేష్ బాబుతో (Suresh Babu) సహా 60 మందికి పైగా పంపిణీదారులు పాల్గొన్నారని టాక్‌. అద్దె ప్రాతిపదికన సినిమాల్ని ప్రదర్శిస్తుండడంతో తమకు ఆదాయం సరిపోవడం లేదని గత కొన్ని రోజులుగా థియేటర్ల (Theaters) యాజమాన్యాలు చెబుతున్న విషయం తెలిసిందే. మల్టీప్లెక్స్‌ తరహాలో వసూళ్లలో పర్సెంటేజీ విధానాన్ని అమలు చేయాలని వారు కోరుతూ వస్తున్నారు. ఇప్పుడు ఫిలిం ఛాంబర్‌తో జరిగిన సమావేశంలో ఈ మేరకు తమ వాయిస్‌ను గట్టిగా వినిపించారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!
  • 2 Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!
  • 3 Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Multiplex Market Downturn PVR Inox Faces Rs 125 Crore Loss

దీనిపై నిర్ణయం తీసుకోకపోతే జూన్‌ 1 నుంచి థియేటర్లని బంద్‌ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలిలో ఆదివారం ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల యజమానులతోపాటు, సొంత థియేటర్లు ఉన్న సినీ ప్రముఖులు కూడా ఇందులో పాల్గొన్నారని భోగట్టా. ఈ డిమాండ్‌పై వెంటనే నిర్ణయం తీసుకునేలా నిర్మాతలకి లేఖ రాయాలని ఛాంబర్‌ను ఎగ్జిబిటర్లు కోరారని చెబుతున్నారు.

అయితే పర్సెంటేజీ విధానంతో తాము నష్టపోవాల్సి వస్తుందని నిర్మాతలు, పంపిణీదారులు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే జూన్‌లో పెద్ద సినిమాలు వరుస కట్టిన నేపథ్యంలో ఎగ్జిబిటర్ల బంద్‌ నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది. వచ్చే నెలలో కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ‘థగ్‌ లైఫ్‌’(Thug Life), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు’(Hari Hara Veera Mallu) , మంచు విష్ణు (Manchu Vishnu)  ‘కన్నప్ప’ (Kannappa) , ధనుష్‌ (Dhanush)  – నాగార్జున(Nagarjuna) ‘కుబేర’ (Kubera) లాంటి సినిమాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో నిర్ణయం త్వరగానే తీసుకుంటారనిపిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Suresh Babu

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

18 mins ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

1 hour ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

1 hour ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version