కరోనా ప్రభావంతో మూతపడ్డ థియేటర్లు తెరుచుకున్నాయి. ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడం మొదలుపెట్టారు. ఇప్పటికే తెలుగులో ఓ మోస్తరు సినిమా ఒకటి విడుదలై పర్వాలేదనిపించే స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. మరో రెండు, మూడు నెలల్లో పరిస్థితులు పూర్తిగా చక్కబడే ఛాన్స్ ఉంది. అప్పుడు సినిమాలకు అడ్డంకులు ఉండకపోవచ్చు. ఈ క్రమంలో కొంతమంది స్టార్ హీరోలు ఓటీటీ యాప్ లను ఎన్నుకోవడంపై విమర్శలు తప్పడం లేదు. ఏవో చిన్న సినిమాలు ఓటీటీలో రిలీజైతే ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదు.
కానీ కాస్త ఓపికతో ఉండాల్సిన స్టార్ హీరోలు ఓటీటీలో సినిమాలకు రిలీజ్ చేస్తుండడంతో పరిశ్రమ వర్గాల నుండి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఓటీటీ క్యూలో మలయాళ సినిమా ‘దృశ్యం-2’, నాగార్జున సినిమా ‘వైల్డ్ డాగ్’ ఉన్నాయి. ఈ సినిమాలు త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ లో విడుదల కాబోతున్నాయి. అయితే ఇలాంటి సినిమాలు జానాల్లో ఆసక్తిని కలిగించి థియేటర్లకు రప్పించే అవకాశాలు ఉన్నాయని.. వాటిని ఓటీటీలో రిలీజ్ చేయడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నిస్తున్నారు.
మోహన్ లాల్ కానీ, నాగార్జున కానీ తమ సినిమాలను థియేటర్లలోనే విడుదల చేయాలని కోరితే.. మేకర్లు అభ్యంతరం చెప్పే పరిస్థితి ఉందని.. అయితే ఆ హీరోలు ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేసినట్లుగా లేరని తెలుస్తోంది. తమ సినిమాలను ఆన్లైన్ లో రిలీజ్ చేయడానికే ఈ హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఉన్నారు. అప్పట్లో జ్యోతిక సినిమా డిజిటల్ రిలీజ్ కి ఒప్పుకున్న సూర్యపై తమిళనాట థియేటర్ల వర్గాలు మండిపడ్డాయి. ఆ తరువాత ఏకంగా సూర్య సినిమానే ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలో రిలీజ్ అవుతుండడంతో మోహన్ లాల్ పై కూడా అలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి.
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!