జూ.ఎన్టీఆర్ కి (Jr NTR) ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ ఏర్పడింది. దీంతో ‘దేవర’ (Devara) చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దారు మేకర్స్. ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ (Sudhakar Mikkilineni) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సమర్పకుడిగా వ్యవహరించారు. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో గతంలో ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) చేశాడు ఎన్టీఆర్. అది మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. దీంతో ‘దేవర’ పై మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి.
Jr NTR
రిలీజ్ ట్రైలర్.. సినిమాకి మంచి బజ్ ఏర్పడేలా చేసింది. దీంతో థియేట్రికల్ బిజినెస్ చాలా బాగా జరిగింది. ట్రేడ్ వర్గాల సమాచారం.. ప్రకారం, ‘దేవర’ చిత్రానికి రూ.174 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఎన్టీఆర్ సోలో హీరోగా హైయెస్ట్ బిజినెస్ చేసింది ఈ మూవీ.
ఒక రకంగా ఎన్టీఆర్ కెరీర్లో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ జరిగింది ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి. అది రూ.451 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది. అయితే సోలో హీరోగా ఎక్కువ థియేట్రికల్ బిజినెస్ చేసింది ‘దేవర’.