2022 సంవత్సరంలో ఆర్ఆర్ఆర్, కార్తికేయ, సీత రామం, బింబిసారా చివర్లో దమాక సినిమాలు మాత్రమే అస్సలైన హిట్ టాక్ సిస్సలైన కలెక్షన్స్ ని సాధించాయి. 2022 లో హిట్స్ కంటే ఎక్కువ ఫ్లోప్స్ ఉన్నాయి…2023 లో అయినా తెలుగు సినిమాలు ఎక్కువ సక్సెస్ రేట్ అండ్ ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తాయి అని అందరు అటు సినీవర్గాలతో పాటు సినిమా లవర్స్ ఆశిస్తున్నారు.
ఆశిస్తే సరిపోదు అలాంటి సినిమాలు ఉండాలి…అప్పుడే మంచి కలెక్షన్స్ వస్తాయి. మరి ఈ సంవత్సరం అలాంటి సినిమాలు ఉన్నాయా? అనే ప్రశ్నకు సమాధానం ఈ పదిహేను సినిమాలు అవి చేయబోయే కలెక్షన్స్ మీద ఆధారపడి ఉంది.
మరి ఆ పదహేను సినిమాలు ఏంటి? ఆ సినిమాలకి అంత సీన్ ఉంది అంటారా అనేది చూస్తే…
వీర సింహ రెడ్డి
నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహ రెడ్డి 2023 లో రిలీజ్ అవుతున్న మొదటి పెద్ద సినిమా. క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్నా సినిమా అవుట్ అండ్ ఫుట్ మాస్ ఎలెమెంట్స్ తో బాలయ్య సమర సింహ రెడ్డి , నరసింహ నాయుడు సిఎంమాల రేంజ్లో ఉండబోతుంది అంట. అదే నిజం అయితే బాక్సపీస్ ముందు బాలయ్య సినిమా కలెక్షన్స్ కి అడ్డు అదుపు ఉండదు…దబిడి దిబిడే.
వాల్తేరు వీరయ్య
ఇక బాలయ్య తో పోటీగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కూడా రాబోతుంది. పవర్, జై లవ కుశ సినిమాలా దర్శకుడు అయినా కే ఎస్ రవీంద్ర (బాబీ) ఈ సినిమాకి దర్శకుడు…ఈ సినిమా కూడా బాలయ్య సినిమా లాగే ఫుల్ మాస్ ఎంటర్టైనర్ అని టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. మరి ఈ సినిమా కి హిట్ టాక్ వస్తే చాలు మెగా కలెక్షన్స్ గ్యారంటీ.
దసరా
నాని నటించిన దసరా సినిమా, మరో రంగస్థలం, పుష్ప లాంటి మాస్ హిట్ అవుతుంది అనిపిస్తుంది. నాని ఫాస్ట్ టైం తన కెరీర్లో మాస్ పాత్ర చేస్తున్నాడు అది కూడా తెలంగాణ నేపధ్యం ఉన్న సినిమా చూడాలి ఏలా ఉంటాదో..ఏం చేస్తదో?
సలార్
కెజిఫ్ దర్శకుడు అయినా ప్రశాంత్ నీల్ తో సినిమా అనగానే ఇది ఒక మాస్ ఆక్షన్ ఎంటర్టైనర్ అని ముందే ఫిక్స్ అయిపోయారు. కానీ సలార్ సినిమాలో లో యాక్షన్, ఫైట్స్ అన్ని కెజిఫ్ కి మించి ఉంటాయి చెప్తున్నారు మేకర్స్…చూడాలి ఈ సినిమా ఎలాంటి సునామి సృష్టించబోతుందో.
హరి హర వీరమల్లు
క్రిష్ జాగర్లమూడి దర్సకత్వంలో పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు అనే పీరియాడిక్ డ్రామాలో ఆక్ట్ చేస్తున్నారు. ఖుషి నిర్మాతః అయినా ఏ.ఏం. రత్నం ఈ సినిమాని పాన్-ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు…మరో మన పవర్ స్టార్ పాన్-ఇండియా కొడ్తారో లేదో చూడాలి…కొడితే మాత్రం కలెక్షన్స్ జాతరే.
ఏజెంట్
అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న సినిమా ఏజెంట్, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయినా టీజర్స్ చూస్తే అర్ధం అవుతుంది… ఈ సినిమాతో అఖిల్ ఒక మాస్ హిట్ కొడతాడు అనే వైబ్ తెలుస్తుంది చూడాలి మరి దర్శకుడు సురేందర్ రెడ్డి ఏం ప్లాన్ చేసాడో
#RC15
రామ్ చరణ్ – శంకర్ డైరెక్షన్లో ఒక పాన్-ఇండియన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాలిటిక్స్ చుట్టూ తిరిగే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అని టాక్. శంకర్ తీసిన జెంటిల్మెన్, ఒకే ఒక్కడు లాంటి సినిమాలా ఉంటుంది అనేది టాక్… అదే నిజం అయితే మారో పాన్-ఇండియ హిట్ కన్ఫర్మ్.
గూఢచారి 2
2022 లో అడివి శేష్ మేజర్, హిట్ 2 సినిమాలా తరువాత ఈ సంవత్సరం గూఢచారి సినిమాతో హిట్ కొట్టడానికి సిద్ధం అవుతున్నాడు. మేజర్ తో మంచి పాన్-ఇండియా మార్కెట్ సెట్ చేసుకున్న శేష్ గూఢచారి 2 హిందీ లో రిలీజ్ చేసి హిట్ కొడితే మరో పాన్-ఇండియా స్టార్ రెడీ అయినట్టే.
రావణాసుర
స్వామి రారా ఫేం సుధీర్ వర్మ డైరెక్షన్లో రవితేజ రావణాసుర అనే ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా లో అటు మాస్ ఎలిమెంట్స్ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని టాక్.
హిట్ 3
హిట్ 1, 2 హిట్స్ తో మంచి ప్రాఫిట్స్ చుసిన నిర్మాత నాని…హిట్ ౩ లో అర్జున్ సర్కార్ గా తానే హీరో గా ఈ ఫ్రాంచైజ్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది గన్ షాట్ హిట్ అని చాల కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నాని.
ప్రభాస్ – మారుతీల రాజా డీలక్స్
ప్రభాస్-మారుతీ తో ఒక సినిమా చేస్తున్నాడు, చాల తక్కువ బడ్జెట్ లో జస్ట్ ఫాన్స్ కోసమే ఒక ఎంతెర్తైనింగ్ మాస్ కథ చేస్తున్నారు అనేది టాక్. ఇది పాన్ ఇండియా కాకుండా ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేస్తారు అని కూడా అంటున్నారు చూడాలి మరి మారుతీ రెబెల్ ఫ్యాన్స్ కోసం ఏం ప్లాన్ చేసాడో.
#SSMB28
త్రివిక్రమ్ – మహేష్ బాబు ఇద్దరు అతడు, ఖలేజా తరువాత సినిమా చేస్తున్నారు. హై వోల్టాగే యాక్షన్ సినిమా గా #SSMB28 ఉంటుంది అని టాక్. చుమై గురూజీ ఈసారి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఏం గిఫ్ట్ ఇస్తాడో.
శాకుంతలం
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శాకుంతలం అనే ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ చేస్తుంది. ఈ సినిమా మీద చాల హైప్ ఉంది మరి ఏం అవుతుందో చూడాలి…
టైగర్ నాగేశ్వర రావు
స్టువార్టుపురం దొంగ టైగర్ నాగేశ్వర రావు నిజ జీవిత కథను టైగర్ నాగేశ్వర రావు గా తీస్తున్నారు. రవి తేజ ఇందులో హీరోగా చేస్తున్నారు…కార్తికేయ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
పుష్ప 2
ఇక చివరగా ఈ ఏడాది చివరి వరకు పుష్ప రెండో పార్ట్ ది రూల్ ని రిలీజ్ చేసే టార్గెట్ తో సుకుమార్ ఉన్నారు. పాన్ ఇండియన్ హిట్ కొట్టిన పుష్ప మీద అంచనాలు ఉన్నాయి …మరి మన పుష్పరాజ్ ఏం చేస్తాడో చూడాలి.