పబ్లిసిటీ ఖర్చు కూడా తీసుకురాని డిజాస్టర్ ఫిలింస్.. నిర్మాతలను నిండా ముంచేసిన ఐదు సినిమాలు ఇవే..!

ఒక సినిమా హిట్ అయితే.. హీరో, హీరోయిన్, డైరెక్టర్‌తో పాటు మిగతా కాస్ట్ అండ్ క్రూ అందరికీ మంచి పేరు, బ్రేక్ వస్తుంది.. కానీ నిర్మాతకు డబ్బులొచ్చాయా.. లేదా అనేది మాత్రం.. సినిమా తీసినన్ని రోజులూ ప్రసవ వేదన పడ్డ ప్రొడ్యూసర్‌కే తెలుస్తుంది.. పాజిటివ్ టాక్, కలెక్షన్స్ వచ్చినా లాభాలు వస్తాయనే గ్యారెంటీ ఉండదు.. కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడి మాత్రమే వస్తే.. మరి కొన్ని సార్లు ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి.. అంచనాలు తారుమారై సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే కనీసం పోస్టర్లకు అంటించే మైదాపిండి ((పబ్లిసిటీ) ఖర్చులు కూడా రావు..

హిట్ అయితే ఆ లెక్క వేరు.. తేడా కొడితే మాత్రం అందరికంటే ముందు రోడ్డు మీదకి వచ్చేసేది నిర్మాతే.. ఈ మధ్య కాలంలో (గత 5 సంవత్సరాలలో) తెలుగులో డిజాస్టర్ టాక్, కనీసం కోటి కూడా వసూలు చేయకుండా.. ఆ లోపే తట్టా బుట్టా సర్దేసి.. నిర్మాతలను నిండా ముంచడమే కాకుండా.. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లకు చుక్కలు చూపించిన 5 సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1) ఆఫీసర్..

కింగ్ నాగార్జున – రామ్ గోపాల్ వర్మల కాంబినేషన్ అనగానే ట్రెండ్ సెట్టర్ ‘శివ’ గుర్తొస్తుంది.. ‘అంతం’, ‘గోవింద గోవింద’ వచ్చిన పాతికేళ్ల తర్వాత ‘ఆఫీసర్’ చేశారు.. ముందునుండి అంచనాలు లేని ఈ మూవీ డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది.. అసలు లెక్కల ప్రకారం ‘ఆఫీసర్’.. కేవలం రూ. 63 లక్షలు మాత్రమే కలెక్ట్ చేశాడు..

2) సన్నాఫ్ ఇండియా..

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తూ నిర్మించిన ‘సన్నాఫ్ ఇండియా’ టీజర్, ట్రైలర్స్ నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.. ఇక థియేటర్లలో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టి.. కేవలం రూ. 6 లక్షలు మాత్రమే రాబట్టింది..

3) జిన్నా..

మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్‌ల సాయంతో ‘జిన్నా’ గా హిట్ కొట్టాలనుకున్నాడు కానీ.. రూ. 63 లక్షల క్లోజింగ్ షేర్‌తో ఖంగు తిన్నాడు.. ఈ సినిమా వల్ల ఎవరికైనా లాభం చేకూరిందా అంటే అది.. ‘జంబలకడి జారు మిఠాయా’ పాట పాడిన మహిళకే..

4) స్వాతిముత్యం..

క్లాసిక్ టైటిల్ ‘స్వాతిముత్యం’ తో బెల్లం బాబు తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. పాజిటివ్ టాక్ వచ్చినా కానీ రూ. 75 లక్షలోపే వసూలు చేసింది.. ఓటీటీలో మాత్రం మంచి స్పందన వచ్చింది..

5) హంట్..

సుధీర్ బాబు, శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ మెయిన్ లీడ్స్.. భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఫిలిం.. ‘హంట్’.. ఈ సినిమా దారుణాతి దారుణంగా.. కనీసం రూ. 20 లక్షల షేర్ కూడా రాబట్టలేకపోయింది..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus