Bigg Boss 7 Telugu: మొదటి వారం ఎలిమినేషన్ లేదనటానికి సాక్ష్యం ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ఎలిమినేషన్స్ అనేవి కొత్తేమీ కాదు. అయితే, ఈసారి సీజన్ అంతా ఉల్టా-పల్టా అన్నారు కాబట్టి నామినేషన్స్ కూడా కొత్తగా ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేశారు అందరూ. కానీ, ఎప్పటిలాగానే బిగ్ బాస్ ఒక్కో పార్టిసిపెంట్ ని పిలిచి యాక్టివిటీ రూమ్ లో నరకం లాగా ఒక సెట్ వేసి మరీ నామినేట్ చేయించాడు. ఈ ప్రక్రియలో ఫస్ట్ శివాజీ వచ్చి హీరో గౌతమ్ కృష్ణ ఇంకా సింగర్ థామినీని నామినేట్ చేశాడు. అలాగే, ప్రియాంక జైన్ వచ్చి రతిక ఇంకా పల్లవి ప్రశాంత్ ఇద్దరినీ నామినేట్ చేసింది.

మిగతా హౌస్ మేట్స్ కూడా వెళ్లి రీజన్స్ చెప్పి ఇద్దరిని నామినేట్ చేశారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నామినేట్ అయిన వాళ్లు కన్ఫషన్ రూమ్ లో నామినేషన్ చేసే ప్రోసెస్ ని చూశారు. అంతేకాదు, అక్కడ చెప్పిన రీజన్స్ ని కూడా వాళ్లు నోటీస్ చేసి తర్వాత వాళ్లని అడిగారు. ఇక్కడే బిగ్ బాస్ హౌస్ లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా ప్రియాంక కి రతిక ఇద్దరికీ కాసేపు ఆర్గ్యూమెంట్ జరిగింది. ఇక శోభాశెట్టి కూడా తనని నామినేట్ చేయడాన్ని తీసుకోలేకపోయింది.

ప్రిన్స్ యవార్ కూడా షకీలా నామినేట్ చేయడాన్ని తప్పుబట్టాడు. అసలు అది రీజనే కాదని చాలాసేపు వాదించాడు. ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం హౌస్ మేట్స్ లో 8మంది నామినేషన్స్ లో ఉన్నారు. వాళ్లలో గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యవార్, షకీలా, కిరణ్ రాధోడ్ , శోభాశెట్టి, రతిక ఇంకా థామిని నామినేషన్స్ లో ఉన్నారు. అయితే, ప్రియాంక జైన్ ని రతిక నామినేట్ చేసిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

నామినేషన్స్ ప్రక్రియ అనేది ఈసారి చాలా ల్యాగ్ అనిపిస్తోంది. ఇప్పటి వరకూ కేవలం ఇద్దరివి మాత్రమే టెలికాస్ట్ చేశారు. ఇంకా 12మంది నామినేషన్స్ ని టెలికాస్ట్ చేయాలి. ఇది మంగళవారం అవుతుంది. ఓటింగ్ బుధవారం స్టార్ట్ చేసినా శుక్రవారం కి ఎండ్ చేయాలి. అంటే కేవలం మూడు రోజులు హాట్ స్టార్ యాప్ ద్వారా అలాగే మిస్డ్ కాల్స్ ద్వారా మనిషికి ఆరు ఓట్లు మాత్రమే పడతాయి. ఇది బిగ్ బాస్ హౌస్ లో (Bigg Boss 7 Telugu)  ఉండేందుకు సరిపోతుందా లేదా అనేది చూడాలి.

అంతేకాదు, ఈసారి ఫస్ట్ వీక్ కాబట్టి ఎలిమినేషన్స్ ఉండవు. దానికి సాక్ష్యం రెండురోజుల పాటు నామినేషన్స్ అనేవి ఉండటమే. అంతేకాదు, బిగ్ బాస్ కేవలం హౌస్ లో ప్రవర్తన మాత్రమే కాకుండా బయట ఎలా ఉన్నారనేది కూడా రీజన్స్ చెప్పచ్చని చాలా క్లియర్ గా చెప్పాడు. కాబట్టి హౌస్ మేట్స్ మద్యలో అగ్గి రాజుకుంటోంది. మరి దీన్ని హౌస్ మేట్స్ ఎలా తీసుకుంటారు అనేది ఆసక్తికరం.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus