ఆ విషయంలో నిరాశపరిచిన టాలీవుడ్ స్టార్స్.. ఏం జరిగిందంటే?
- September 28, 2024 / 12:22 PM ISTByFilmy Focus
2024 సంవత్సరం టాలీవుడ్ సినీ అభిమానులకు ఎంతో ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. మహేష్ (Mahesh Babu) గుంటూరు కారం (Guntur Kaaram) , ప్రభాస్ (Prabhas) కల్కి (Kalki 2898 AD) ఇప్పటికే రిలీజై హిట్ కాగా మరికొన్ని గంటల్లో దేవర మూవీ థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. పుష్ప2 (Pushpa 2), గేమ్ ఛేంజర్ (Game Changer) సైతం ఇదే సంవత్సరం థియేటర్లలో విడుదల కానుండటంతో అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. అయితే ఈ ఏడాది చిరంజీవి (Chiranjeevi) , బాలయ్య (Balakrishna) , పవన్ (Pawan Kalyan) సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు.
Star Heroes

సీనియర్ స్టార్ హీరోలలో (Star Heroes) చిరంజీవి, బాలయ్య టైర్1 స్టార్ హీరోలలో పవన్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచారు. వచ్చే ఏడాది ఫస్టాఫ్ లో ఈ ముగ్గురు హీరోల సినిమాలు విడుదల కానున్నా ఈ ఏడాది సినిమాలు రిలీజ్ కాకపోవడం అభిమానులకు ఒకింత షాక్ అనే చెప్పాలి. టాలీవుడ్ హీరోలు అభిమానులను నిరాశ పరిచారనే చెప్పాలి. విశ్వంభర (Vishwambhara), బాలయ్య బాబీ (Bobby) కాంబో మూవీ సంక్రాంతి రేసులో ఉన్నా రిలీజ్ సమయానికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.
టాలీవుడ్ స్టార్ (Star Heroes) హీరోలు వేగంగా సినిమాల్లో నటించకపోతే ఆయా హీరోల సినిమాల సంఖ్య తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో థియేటర్లు కళకళలాడాలంటే ఇకపై అయినా స్టార్ హీరోలు గ్యాప్ లేకుండా సినిమాల్లో నటించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. టాలీవుడ్ స్టార్స్ ఇకపై అయినా సినిమాల విషయంలో వేగం పెంచుతారేమో చూడాల్సి ఉంది.
టాలీవుడ్ స్టార్స్ రెమ్యునరేషన్స్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న హీరోలు కథల ఎంపికలో పొరపాట్లు చేస్తే ఆ ప్రభావం డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లపై పడే అవకాశం ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలకు ఆకాశమే హద్దుగా క్రేజ్ పెరుగుతుండగా ఈ హీరోలు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. యంగ్ డైరెక్టర్ల ఎంట్రీతో టాలీవుడ్ ఇండస్ట్రీ కళకళలాడుతోంది.















