ఆ హీరోయిన్లు సీనియర్ హీరోలకు ప్లస్ అవుతున్నారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ హీరోల సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ ఇప్పటికీ మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. అయితే సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరికే విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం గమనార్హం. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం సీనియర్ హీరోలకు జోడీగా నటించడానికి ఓకే చెబుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ఈ హీరోయిన్ల జాబితాలో తమన్నా, సోనాల్ చౌహాన్, శృతి హాసన్, నయనతార ఉన్నారు. ఈ నలుగురు హీరోయిన్లలో నయనతార ఒక్కో సినిమాకు రికార్డు స్థాయిలో డిమాండ్ చేస్తుండటంతో బడ్జెట్ ను బట్టి నిర్మాతలు ఈమెను ఎంపిక చేస్తున్నారు. చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకీలకు జోడీగా నయన్ ఇప్పటికే నటించారు. మరో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ పరిమితంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుండటం గమనార్హం.

శృతి హాసన్ సీనియర్ హీరోలకు జోడీగా నటించిన సినిమాలు కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధిస్తుండటంతో శృతిహాసన్ కు ఛాన్స్ లు పెరుగుతున్నాయి. కొందరు డైరెక్టర్లకు శృతి హాసన్ లక్కీ హీరోయిన్ కావడం గమనార్హం. ప్రస్తుతం శృతి హాసన్ చిరంజీవికి జోడీగా ఒక సినిమాలో బాలయ్యకు జోడీగా ఒక సినిమాలో నటిస్తున్నారు.

మరో సీనియర్ హీరోయిన్ తమన్నా కూడా సీనియర్ స్టార్ హీరోలకు జోడీగా నటించడానికి ఓకే చెబుతున్నారు. సోనాల్ చౌహాన్ తెలుగులో పరిమితంగా సినిమాలలో నటిస్తున్నా సీనియర్ హీరోలకు జోడీగా నటించడానికి ఓకే చెబుతున్నారు. ఈ స్టార్ హీరోయిన్లు సీనియర్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా మారారు. కాజల్ కూడా ఈ జాబితాలో ఉన్నా గతంతో పోల్చి చూస్తే ఆమెకు కొంతమేర క్రేజ్ తగ్గింది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus