Adipurush: ఆదిపురుష్ హిట్టైతేనే ఆ సినిమాలు మొదలయ్యే ఛాన్స్ ఉందా?

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ సినిమా రిలీజ్ కు రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ కు సంబంధించి వేగం పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మరిన్ని మైథలాజికల్ సినిమాలు తెరకెక్కే ఛాన్స్ ఉంది.

ఈ సినిమా కలెక్షన్ల ఆధారంగా మైథలాజికల్ సినిమాలను నిర్మించే విషయంలో ముందుకెళ్లాలా? లేక వెనక్కు వెళ్లాలా? అనే నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ తరం ప్రేక్షకులు ఈ సినిమాల విషయంలో ఎలా రియాక్ట్ అవుతారనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది. ఆదిపురుష్ మూవీ విడుదలైతే ఫస్ట్ వీకెండ్ వరకు కలెక్షన్ల విషయంలో ఢోకా ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆదిపురుష్ (Adipurush) సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గతంతో పోల్చి చూస్తే విజువల్ ఎఫెక్స్స్ ను మెరుగుపరచడంతో ఆదిపురుష్ మూవీకి బుకింగ్స్ సైతం భారీ రేంజ్ లో ఉండే అవకాశం అయితే ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఆదిపురుష్ సినిమా ప్రేక్షకులను రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో మెప్పించనుందో చూడాల్సి ఉంది.

ఆదిపురుష్ మూవీకి ఖర్చుకు సంబంధించి మేకర్స్ ఏ మాత్రం రాజీ పడటం లేదని తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల కోసం సైతం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది. సాహో, రాధేశ్యామ్ సినిమాల విషయంలో జరిగిన తప్పు ఈ సినిమా విషయంలో జరగకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆదిపురుష్ విడుదలకు ముందే ప్రీమియర్స్ ప్రదర్శితం కానుండటంతో ఈ సినిమా టాక్ ముందుగానే తేలిపోనుందని తెలుస్తోంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus