టాలీవుడ్ రేంజ్ ను పెంచనున్న పాన్ ఇండియా సినిమాలివే!

దర్శకధీరుడు రాజమౌళి టాలీవుడ్ సినిమాల రేంజ్ ను పెంచగా సుకుమార్, ప్రశాంత్ నీల్, చందూ మొండేటి, రిషబ్ శెట్టి, శంకర్ తమ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల ద్వారా సౌత్ సినిమాల స్థాయిని మరింత పెంచుతున్నారు. బోయపాటి శ్రీను, నాగ్ అశ్విన్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, బుచ్చిబాబు, క్రిష్ మరి కొందరు దర్శకులు రాబోయే రోజుల్లో పాన్ ఇండియా దర్శకుల జాబితాలో కచ్ఛితంగా చేరతామని భావిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలలో ఒకటి రెండు సినిమాలు మినహా మిగతా సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కుతున్నాయి.

ఈ సినిమాలలో కొన్ని సినిమాలు 2023లో విడుదలయ్యే ఛాన్స్ ఉండగా మరికొన్ని సినిమాలు 2024లో రిలీజ్ కానున్నాయి. 2023 సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య భారీ స్థాయిలో పోటీ ఉండగా 2024 సంక్రాంతి సమయంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొంతమంది దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించకపోయినా తమ సినిమాలను 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం. సినిమా రంగానికి 2022 బాగానే కలిసొచ్చింది.

అయితే 2023 మాత్రం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో అంతకుమించి ఉండనుందని తెలుస్తోంది. చరణ్ శంకర్ కాంబో మూవీ, ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ, బన్నీ సుకుమార్ కాంబో మూవీ, ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ, పవన్ క్రిష్ కాంబో మూవీ, మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

ఈ సినిమాల కోసం ఆయా హీరోల అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ ఆరు ప్రాజెక్ట్ లలో దాదాపుగా అన్ని సినిమాలు పాజిటివ్ టాక్ వస్తే సులువుగా 200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంటాయని చెప్పవచ్చు. ఈ సినిమాలలో ఎన్ని సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజవుతాయో ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తాయో చూడాలి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus