ఈ అందమైన హీరోయిన్లు అలాంటి సమస్యలతో బాధపడుతున్నారా?

  • December 2, 2023 / 02:23 PM IST

సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలు కేవలం సాధారణ వ్యక్తులకే కాకుండా సినీ సెలబ్రిటీలకు కూడా ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలుస్తుంది. తెరపై ఎంతో అందంగా కనపడుతూ అందరిని తమ నటనతో ఆకట్టుకుంటున్నటువంటి అందమైన హీరోయిన్స్ కూడా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా కొనసాగిన వీరందరూ కూడా వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నారు మరి వారు ఎవరు అనే విషయానికి వస్తే…

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి (Samantha) సమంత ప్రస్తుతం మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె గత కొంతకాలంగా ఈ వ్యాధితో బాధపడుతూ ఈ వ్యాధికి సరైన చికిత్స తీసుకోవడం కోసమే సినిమాలకు కూడా దూరమయ్యారు. ఇక లేడీ సూపర్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నయనతార కూడా స్కిన్ ఎలర్జీతో బాధపడ్డారట ఈమె మేకప్ వేసుకుంటే స్కిన్ మొత్తం ఎర్రగా మారిపోతుందని దీంతో బాధపడుతూ రెండు సంవత్సరాలు పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండి ఈ వ్యాధిని నయం చేసుకున్నారు.

స్నేహ ఉల్లాల్ అచ్చం ఐశ్వర్యరాయ్ పోలికలతో ఉన్నటువంటి ఈమె ఆటో ఇమ్యున్ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడ్డారట. ఈ వ్యాధి కారణంగా ఈమె ఎక్కువ సేపు నిలబడలేక పోవడం వంటివి జరిగేది ఒక్కోసారి షూటింగ్ లొకేషన్లో కూడా పడిపోవడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక మమత మోహన్ దాస్ హంసానందిని వంటి హీరోయిన్స్ భయంకరమైనటువంటి క్యాన్సర్ బారిన పడి ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి కెరియర్ పరంగా బిజీగా మారారు.

దేవదాసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై పోకిరితో బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి ఇలియానా సన్నజాజితీగల ఎంతో నాజుగ్గా ఉండేది అయితే ఈమె ఉన్నఫలంగా శరీర బరువు పెరిగిపోయారు. ఇలా శరీర బరువు పెరగడానికి కారణం ఆమె బాధ పడుతున్నటువంటి బాడీ డిస్పోర్విక్ డిసీజ్ కారణమని, ఈ వ్యాధి కారణంగానే ఇలియానా అధిక బరువు పెరగారని తెలుస్తుంది. అయితే ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఈమె కోలుకున్నారు. ఇలా ఈ హీరోయిన్స్ అందరూ కూడా వెండి తెరపై ప్రేక్షకులను సందడి చేసిన తెర వెనుక మాత్రం ఇలాంటి భయంకరమైన వ్యాధులతో బాధపడ్డారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus