Veera Simha Reddy: అలా చేసి ఉంటే వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ అయ్యేదా?

సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి మూవీ బాలయ్య అభిమానుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా ఏదో మిస్ అయ్యిందనే భావనను ఈ సినిమా కలిగించిందనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో గోపీచంద్ మలినేని చేసిన పొరపాట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఫస్ట్ హాఫ్ లో వీరసింహారెడ్డి పాత్ర గూస్ బంప్స్ సీన్లు అన్నీ ఉండటం సినిమాకు ఒక విధంగా ప్లస్ అయితే మరో విధంగా మైనస్ అయింది.

సింహా, లెజెండ్, అఖండ సినిమాల తరహాలో వీరసింహారెడ్డి స్క్రీన్ ప్లేను ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ తరహా గూస్ బంప్స్ సీన్లు సెకండాఫ్ లో లేవు. సెకండాఫ్ కొంతమంది ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మరి కొందరికి కనెక్ట్ కాలేదు. సినిమాలో దాదాపుగా 20 నిమిషాల సన్నివేశాలను కట్ చేసి ఉంటే సినిమా పర్ఫెక్ట్ గా ఉండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మోతాదుకు మించి సినిమాలో ఫైట్లు ఉన్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆసక్తికరంగా లేని ఫ్లాష్ బ్యాక్, రివర్స్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మైనస్ అయింది.

ఇంటర్వెల్ సీన్ అదిరిపోయిందని అయితే వీర సింహారెడ్డి భానుమతి పాత్రల మధ్య బాండింగ్ సీన్లు మరీ ఆకట్టుకునే స్థాయిలో లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్యకు వీరాభిమాని అయిన గోపీచంద్ మలినేని బాలయ్య గత సినిమాల పోలికలు లేకుండా ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఫస్ట్ డేతో పోలిస్తే ఈ సినిమాకు బుకింగ్స్ అయితే తగ్గాయి. అయితే శని, ఆదివారాలలో ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.

వీరసింహారెడ్డి తొలిరోజు కలెక్షన్లు మాత్రం రికార్డ్ స్థాయిలో ఉండనున్నాయని సమాచారం. కలెక్షన్ల పరంగా అబవ్ యావరేజ్ గా వీరసింహారెడ్డి నిలిచే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని గోపీచంద్ మలినేని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus