Akkineni Fans: అక్కినేని అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ ఇది!
- December 9, 2024 / 10:04 PM ISTByFilmy Focus
అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) వరుస లోపులతో సతమతమవుతున్నాడు. 2022 లో వచ్చిన ‘బంగార్రాజు’ (Bangarraju) తర్వాత అతను చేసిన ‘థాంక్యూ’ (Thank You) ‘కస్టడీ’ (Custody) వంటి సినిమాలు పెద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. ఆ రెండు సినిమాలపై అతను చాలా హోప్స్ పెట్టుకుని కష్టపడ్డాడు. అలాగే ఆమిర్ ఖాన్ తో (Aamir Khan) కలిసి చేసిన ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha) కూడా నిరాశపరిచింది. కానీ గత ఏడాది చేసిన ‘దూత’ (Dhootha) వెబ్ సిరీస్..కి మంచి మార్కులే పడ్డాయి. ఆ సిరీస్ కి ప్రేక్షకుల నుండి మంచి అప్రిసియేషన్ వచ్చింది.
Akkineni Fans

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అతను ‘తండేల్’ (Thandel) అనే సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో ‘గీతా ఆర్ట్స్’ సంస్థపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకుడు. సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్. ఇక ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా సంక్రాంతి రేసు నుండి ఈ సినిమా తప్పుకుంది. ఫిబ్రవరి 7న ‘తండేల్’ సినిమా రిలీజ్ కాబోతోంది.

కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని మేకర్స్ చెబుతున్నారు. నాగ చైతన్య ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరడం గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకి ‘కుబేర’ (Kubera) కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో ధనుష్ (Dhanush) హీరోగా కాగా అక్కినేని నాగార్జున (Nagarjuna) కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకుడు. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. సో 2025 ఫిబ్రవరి అక్కినేని అభిమానులకి (Akkineni Fans) చాలా స్పెషల్ అన్నమాట.

రజినీకాంత్ తో సీక్వెల్.. డైరెక్టర్ ప్లాన్ మళ్ళీ మారింది!

















