Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో పవన్ ఫ్యాన్స్ కు ఆ టెన్షన్ అక్కర్లేదా?
- August 20, 2024 / 12:21 PM ISTByFilmy Focus
రవితేజ (Ravi Teja) హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ లో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించడం లేదు. ఈ సినిమాకు పోటీగా విడుదలైన ఇతర సినిమాలకు బెటర్ టాక్ రావడం కూడా మిస్టర్ బచ్చన్ కలెక్షన్లపై ప్రభావం చూపింది. అయితే మిస్టర్ బచ్చన్ ప్రభావం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) పై ఉండకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. హరీష్ శంకర్ సినిమాలు అంచనాలను అందుకోని ప్రతి సందర్భంలో తర్వాత సినిమాతో ఆయన ప్రూవ్ చేసుకున్నారు.
Pawan Kalyan

మరోవైపు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు హరీష్ శంకర్ వీరాభిమాని కావడంతో ఈ సినిమా విషయంలో ఆయన మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ తో తనను తాను ప్రూవ్ చేసుకోవడం హరీష్ శంకర్ కు కీలకం కాగా మిస్టర్ బచ్చన్ మూవీ విషయంలో వచ్చిన నెగిటివ్ కామెంట్లను సైతం ఆయన పరిగణనలోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో పవన్ ఫ్యాన్స్ కు టెన్షన్ అక్కర్లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండటంతో ఈ సినిమాకు బడ్జెట్ విషయంలో సైతం లిమిట్స్ లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు డేట్లు కేటాయించనున్నారని భోగట్టా. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గబ్బర్ సింగ్ (Gabbar Singh) మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని భోగట్టా. ఈ సినిమాలో సాంగ్స్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని తెలుస్తోంది. పవన్ పుట్టినరోజు కానుకగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఏదైనా క్రేజీ అప్ డేట్ వస్తుందేమో చూడాలి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ మార్క్ డైలాగ్స్ ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
















