Mythri Movie Makers: ఆ కారణంతోనే ఎక్కువగా డబ్బింగ్ సినిమాలు చేస్తున్నారా?

  • September 11, 2024 / 09:50 AM IST

‘మైత్రి మూవీ మేకర్స్’ (Mythri Movie Makers) టాలీవుడ్ టాప్ బ్యానర్స్ లో ఒకటి. ఎంట్రీ ఇవ్వడంతోనే ‘శ్రీమంతుడు’ (Srimanthudu) ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) ‘రంగస్థలం’ (Rangasthalam) వంటి 3 ఇండస్ట్రీ హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత కూడా చేసిన ప్రతి పెద్ద సినిమా బాగా ఆడింది. 2023 సంక్రాంతికి అయితే ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) వంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను రిలీజ్ చేయడమే కాకుండా.. ఆ రెండింటితో సూపర్ హిట్లు అందుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.

Mythri Movie Makers

అంతేకాదు ఆ సినిమాలతో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. వరుస పెట్టి సినిమాలను విడుదల చేస్తూ వస్తోంది. ‘ఆదిపురుష్’ (Adipurush) ‘సలార్’ (Salaar) ‘హనుమాన్’ (Hanuman) ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలను విడుదల చేసింది ఈ సంస్థ. అంతేకాదు చిన్న సినిమాలను కూడా వరుసపెట్టి విడుదల చేస్తుంది. కానీ ఎందుకో ఈ సంస్థకి (Mythri Movie Makers) డబ్బింగ్ సినిమాలపై మోజు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది.

‘గోట్ లైఫ్- ఆడు జీవితం’ (The GOAT Life) ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys)’లవ్ గురు’ ‘మహారాజా’.. ఇలా ఎక్కువ శాతం డబ్బింగ్ సినిమాలనే విడుదల చేస్తూ వస్తోంది ఈ సంస్థ. గత వారం ‘ది గోట్'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం)(The Greatest of All Time)  చిత్రాన్ని విడుదల చేసిన ఈ సంస్థ.. ఈ వారం ‘ఏ.ఆర్.ఎం’ చిత్రాన్ని కూడా విడుదల చేస్తుంది.

ఇలా వరుసపెట్టి డబ్బింగ్ సినిమాలపైనే ఆధార పడుతూ వస్తోంది ‘మైత్రి’ (Mythri Movie Makers) డిస్ట్రిబ్యూషన్ సంస్థ. చూస్తుంటే.. స్ట్రైట్ సినిమాలపై ఈ సినిమాకి నమ్మకం తక్కువో లేక.. డబ్బింగ్ సినిమాలకి అయితే ఎక్కువ షేర్ మిగులుతుందనో’ కానీ ఈ సంస్థ ఎక్కువగా డబ్బింగ్ సినిమాలపైనే మోజు పెంచుకున్నట్టు స్పష్టమవుతుంది.

టాలీవుడ్‌ హీరోలపై టొవినో థామస్‌ కామెంట్స్‌.. ఎవరి గురించి ఏం చెప్పాడంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus