Tovino Thomas: టాలీవుడ్‌ హీరోలపై టొవినో థామస్‌ కామెంట్స్‌.. ఎవరి గురించి ఏం చెప్పాడంటే?

టొవినో థామస్‌ (Tovino Thomas) .. కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల ముందు వరకు తెలుగువారికి పెద్దగా పరిచయం లేని పేరు. అయితే ఆ సమయంలో అన్ని సినిమాల్లాగే మలయాళ సినిమాలు కూడా మనకు పరిచయం అయ్యాయి. టొవినో థామస్‌ చాలామందికి అభిమాన నటుడు అయిపోయాడు. అందుకేనేమో ఆయన కొత్త సినిమా ‘ఏఆర్‌యమ్‌’ (అజయంతే రంధం మోషణమ్‌) సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగులో రిలీజ్‌ చేస్తోంది. అన్నట్లు హీరోయిన్‌ కూడా మనకు పరిచయం ఉన్న అమ్మాయే.

Tovino Thomas

ఈ నేపథ్యంలో హీరోయిన్‌ కృతి శెట్టితో (Krithi Shetty)   కలసి హైదరాబాద్‌లో ‘ఏఆర్‌ఎమ్‌’ టీమ్‌ మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలో తెలుగు స్టార్‌ హీరోల గురించి టొవినో థామస్‌ (Tovino Thomas) చెప్పిన విషయాలు వైరల్‌గా మారిపోయాయి. ఈ సినిమా మా డ్రీమ్‌ ప్రాజెక్టు. 2017లో దర్శకుడు జితిన్‌, రచయిత సుజిత్‌ నంబియార్‌ నన్ను కలిసి కథ చెప్పారు. సినిమా కోసం త్రిపాత్రాభినయం చేయాల్సి ఉంటుందని కూడా చెప్పారు. తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో ఇటీవల హాజరైన ఓ ఈవెంట్‌లో చూశాను.

అందుకే టాలీవుడ్‌లో భాగం కావాలనుకుంటున్నాను. ఇక్కడ సినిమాలు చేయాలని ఉంది అని మనసులో మాట చెప్పాడు టొవినో థామస్‌  (Tovino Thomas) . మరి తెలుగు హీరోల గురించి చెబుతారా అంటే.. ప్రభాస్‌ను (Prabhas) అభిమానించని వారెవరుంటారు? ‘బాహుబలి’ (Baahubali)గా ఆయన్ను తప్ప మరొకరిని ఊహించుకోలేం అని చెప్పాడు. ఇక తాను చూసిన తొలి తెలుగు సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) అని టొవినో చెప్పాడు. తన పదో తరగతి నుండి అల్లు అర్జున్‌ (Allu Arjun) సినిమాలు చూస్తున్నానని..

రామ్‌ చరణ్‌ (Ram Charan) , ఎన్టీఆర్‌  (Jr NTR) అంటే తనకు బాగా ఇష్టమని తెలిపాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమా ప్రచారం కేరళలో అయినప్పుడు వారిద్దరి కలసి పాల్గొన్నాను అని గుర్తు చేసుకున్నాడు. అన్నట్లు అసలు విషయం చెప్పలేదు కదా.. ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. తెలుగులో వరుస సినిమాలు చేసినా విజయం దక్కని కృతి శెట్టికి ఈ సినిమా విజయం చాలా అవసరం.

తారక్ ధరించిన ఈ షూస్ ఖరీదు అన్ని వేలా.. ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus