రాజమౌళి అంటే భారీతనం ఒక్కటే కాదు!

  • September 11, 2022 / 12:42 AM IST

అన్ని సినిమాలు ఒకేలా ఉండవు.. అలానే అన్ని భారీ సినిమాలు ఒకేలా ఉండవు. అందుకే భారీ చిత్రాలన్నింటికీ ఒకేలా ఫలితం రాదు. అచ్చంగా అలానే తీశాం, అంతకుమించి తీశాం అని ఆయా దర్శకనిర్మాతలు అనుకోవచ్చు. కానీ ఫలితం మాత్రం అలా రాదు. ఈ విషయాన్ని ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే.. అందరూ రాజమౌళి తరహా సినిమాలు తీస్తారు, కానీ ఫలితం మాత్రం ఆయన సినిమాల్లా రాదు. దీని వెను కారణమేంటి? ఇప్పుడు ఇదే ప్రశ్న దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. దీనికి కారణం ‘బ్రహ్మాస్త్ర’ సినిమా దారుణ పరాజయమే.

పాన్‌ ఇండియా సినిమాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న సినిమాలు, భారీ కాన్వాస్‌ ఉన్న సినిమాలు తీస్తుంటారు రాజమౌళి. ఆయన్ని ఫాలో అవ్వడానికి, అలాంటి సినిమాలు తీయడానికి చాలామంది దర్శకులు ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు, చేస్తారు కూడా. అయితే ఆయన పాటించే ఓ చిన్న పాటి మంత్రం వారి దగ్గర మిస్‌ అవుతోంది. అందుకే ఫ్లాప్‌లు వస్తున్నాయి అని చెబుతున్నారు. ఆ మ్యాజిక్‌ పాయింట్‌ను పక్కాగా పట్టుకుని, అమలు చేస్తారు కాబట్టే జక్కన్న దగ్గరకు రావాలంటే ఫ్లాప్‌ అనేది భయపడుతుంది అని అంటున్నారు.

రాజమౌళి దగ్గరున్న ఆ బ్రహ్మాస్తం ఏంటి అనుకుంటున్నారా? ఇంకేముంది ఎమోషన్‌. అంటే ఎంత విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రధానం రూపొందించిన సినిమా అయినప్పటికీ.. అందులో పాత్రల మధ్య ఎమోషన్‌, సినిమా – ప్రేక్షకుడు మధ్య ఎమోషన్‌ సరిగ్గా లేకపోతే ఫలితం బాగోదు అని చెబుతుంటారు పెద్దలు. రాజమౌళి ఈ విషయాన్ని బలంగా నమ్ముతారు కాబట్టే.. ఆయనకు విజయాలు దక్కుతున్నాయి అని చెబుతున్నారు. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించిన ‘బ్రహ్మాస్త్ర’లో ఇది మిస్‌ అవ్వడం వల్లే విజయం దక్కలేదు అని చెప్పొచ్చు.

సినిమా చూస్తున్నపుడు ఏదో ఒక ఎమోషన్‌తో ప్రేక్షకుడు కనక్ట్ అవ్వాలి. ఈ ఎమోషన్‌ను పట్టుకోవడంలో రాజమౌళి దిట్ట అని చెప్పొచ్చు. ‘బాహుబలి’ సినిమాలో బాహుబలి, భల్లాల దేవ, శివగామి, దేవసేన, కట్టప్ప కానీ.. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో భీమ్, అల్లూరి, సీత పాత్రలు ఇలా కనక్ట్‌ అయినవే. అందుకే సినిమా అయిపోతూ రిటర్న్‌ వచ్చే ప్రేక్షకుడికి ఆ పాత్రలు మెదడులో ఓ మూల కొన్ని రోజులపాటు ఉండిపోతాయి.

ఈ విషయాన్ని అర్థం చేసుకొని, తమ సినిమాల్లో పొందుపరుచుకుంటే విజయం పక్కా అని అంటున్నారు పరిశీలకులు. ‘బ్రహ్మాస్త్రం’ దగ్గరికి వచ్చేసరికి సినిమాను సూపర్ హీరో కథ అనేలా తీర్చిదిద్దారు అయాన్‌ ముఖర్జీ. దీంతో తెరపై మైమరపించే, మెరిపించే దృశ్యాలు కనిపిస్తున్నా… వాటిలో ఎమోషన్ మిస్ అయ్యింది. అందుకే స్పెషల్‌, ఎమోషన్‌ అనేది పర్‌ఫెక్ట్‌ మిక్స్‌ అయ్యేలా చూసుకోవాలి. అన్నట్లు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇలాంటి ఎమోషన్‌ కాస్త తక్కువ మోతాదులో ఉందని రాజమౌళిని సైతం కొంతమంది పరిశీలకులు విమర్శించారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus