Samantha: సమంత గురించి ఈ షాకింగ్ విషయం మీకు తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యశోద, శాకుంతలం, ఖుషి సినిమాలతో సమంత ప్రేక్షకుల ముందుకు వస్తుండగా ఈ మూడు సినిమాలపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూడు సినిమాలలో కనీసం రెండు సినిమాలు సక్సెస్ సాధించినా సమంత కెరీర్ పుంజుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు గత కొంతకాలంగా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు.

కారణాలు తెలియకపోయినా సమంత మాత్రం అటు షూటింగ్ లకు, ఇటు సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో ఆమె గురించి జోరుగా చర్చ జరుగుతోంది. అయితే సమంత డబ్బును ఖర్చు చేయడానికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సమంత తను సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని విరాళాల రూపంలో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం సమంత వేద భవనంలో హోమం నిర్వహించిన సంగతి తెలిసిందే.

అయితే వేద భవనానికి సమంత భారీ మొత్తంలో విరాళం ఇచ్చారని తెలుస్తోంది. మరో ఆశ్రమానికి సైతం ఆవులను విరాళంగా ఇవ్వాలని సామ్ భావిస్తున్నారు. ఈ విషయం తెలిసి సమంత మంచి మనస్సును నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా తన వంతుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సమంత కొన్ని విషయాలలో ఇతర హీరోయిన్లకు భిన్నంగా మంచి పనుల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ హీరోయిన్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. తెలుగుతో ఇతర భాషల సినిమాలు కూడా సమంత చేతిలో ఉన్నాయి. లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లకు సమంత ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. సమంత కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని ఆమె మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సమంతను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus