ప్రతి హీరో కెరీర్ లో కొంతకాలం బ్యాడ్ టైమ్ నడుస్తుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం శక్తి సినిమా నుంచి రభస సినిమా వరకు వరుస ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఇబ్బందులు పడ్డారు. బాద్ షా సినిమా హిట్టైనా ఆ సినిమా తారక్ కెరీర్ ను మరీ భారీ స్థాయిలో ప్రయోజనం చేకూర్చలేదు. ఆ సమయంలో తారక్ వరుసగా హిట్ డైరెక్టర్లకు మాత్రమే ఛాన్స్ ఇస్తున్నాడని విమర్శలు రావడం గమనార్హం.
టెంపర్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ లో ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే సినిమాలలో నటిస్తానని మాటిచ్చిన తారక్ ఆ మాటను నిలబెట్టుకున్నారు. అయితే టెంపర్ సినిమా రిలీజ్ రోజున తారక్ పడిన టెన్షన్ అంతాఇంతా కాదట. టెంపర్ ప్రీమియర్ షోస్ పూర్తైనా తనకు కాల్స్, మెసేజెస్ రాకపోవడం జూనియర్ ఎన్టీఆర్ ను మరింత టెన్షన్ పెట్టిందని సమాచారం.
ఆ సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకరు కాలర్ ఎగరేసుకున్న ఫోటోను వాట్సాప్ లో పంపగా ఫోటోతో ఉన్న ఆ ఒక్క మెసేజ్ ఎన్టీఆర్ కు కొండంత బలాన్ని ఇచ్చిందని సమాచారం. టెంపర్ తర్వాత తారక్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలు తారక్ రేంజ్ ను ఊహించని స్థాయిలో పెంచాయి. జై లవకుశ, అరవింద సమేత, ఆర్.ఆర్.ఆర్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.
తారక్ (Jr NTR) ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ రోల్ నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. దేవర సినిమా సీక్వెల్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉందని తెలుస్తోంది.