మే నెల చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో హిట్ అయిన సినిమాలు ‘సర్కారు వారి పాట’ ‘డాన్’ ‘ఎఫ్3’ వంటి సినిమాలు మాత్రమే ఉన్నాయి. విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం కొంతవరకు పర్వాలేదు అనిపించింది. థియేటర్ తో సమానంగా ఓటిటిల్లో కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ ‘ఆచార్య’ వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘ఆహా’ వంటి ఓటిటిలో రిలీజ్ అయిన దొంగాట, రైటర్ వంటి సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉండగా.. జూన్ మొదటి వారంలో కూడా సినిమాల పండగ మొదలు కాబోతుంది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీల్లో కూడా మంచి సినిమాలు/ వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. ఈ నెలలో పెద్ద సినిమాలు లేవు కానీ మిడ్ రేంజ్ సినిమాలు.. పైగా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. సరే ఆ విషయాలను పక్కన ఈ వారం థియేటర్ మరియు ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు/వెబ్ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు :
1) మేజర్ : వైవిధ్యమైన కథలు, సినిమాలతో ప్రేక్షకులను అలరించే అడవి శేష్ ‘మేజర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 26/11 ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో ఎంతో మంది ప్రాణాలు కాపాడి ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో ప్రివ్యూలు వేయడం వాటికి మంచి స్పందన రావడం జరిగింది. మహేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించడంతో భారీ హైప్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ. అడివి శేష్ సరసన సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ వంటి భామలు నటించారు.
2) విక్రమ్ : కమల్ హాసన్, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలు కలిసి నటించిన ఈ చిత్రాన్ని ‘రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్’ బ్యానర్ పై కమల్ హాసన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. మరో స్టార్ హీరో సూర్య కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తుండడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.’ఖైదీ’ ‘మాస్టర్’ చిత్రాలను అందించిన లోకేష్ కనగరాజన్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. ఈ మూవీ కూడా జూన్ 3నే విడుదల కాబోతుంది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
3) పృథ్వీరాజ్ : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం జూన్ 3నే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో రాజ్‌పుత్ యోధుడు పృథ్వీరాజ్ చౌహాన్ వీరగాథని చూపించబోతున్నారు.2017 మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ గా నిలిచిన మానుషి చిల్లర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.ఈ మూవీ కోసం ఆమె ఏకంగా రూ.1 కోటి పారితోషికం అందుకుంది. చంద్రప్రకాష్ ద్వివేది తెరకెక్కించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగుతో పాటు పలు దక్షిణాదిలో ఉన్న అన్ని భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.బాలీవుడ్లో ఈ మధ్య కాలంలో భారీ హిట్టు పడలేదు. సౌత్ సినిమాలు అక్కడ డామినేట్ చేసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ మూవీ సక్సెస్ అవ్వాలని అక్కడి ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
ఓటిటి లో విడుదలయ్యే సినిమాలు/వెబ్ సిరీస్ లు :
4) 9 అవర్స్ : తారక రత్న మధుషాలిని నటించిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూన్ 2 నుండీ స్ట్రీమింగ్ కానుంది.
5) జనగణమన : ఈ మలయాళం మూవీ జూన్ 2 నుండీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
6) అశోకవనంలో అర్జున కళ్యాణం : విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ జూన్ 3 నుండీ ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.
7) ది పర్‌ఫెక్ట్ మదర్ : ఈ వెబ్ సిరీస్ జూన్ 3 నుండీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
8) సర్వైవింగ్ సమ్మర్ : ఈ వెబ్ సిరీస్ జూన్ 3 నుండీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
9) ది బాయ్స్ : ఈ వెబ్ సిరీస్ జూన్ 3 నుండీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
10) ఆశ్రమ్- సీజన్ 3 : ఈ వెబ్ సిరీస్ ఎంఎక్స్ ప్లేయర్‌లో జూన్ 3 నుండీ స్ట్రీమింగ్ కానుంది.