ఈ నెలలో కొత్త వారం మొదలైపోయింది. మరి ఈ వీకెండ్‌లో ఏయే సినిమాలు విడుదలవుతాయో చూడాలిగా. అందుకే లిస్ట్ తీసుకొని వచ్చేశాం. థియేటర్లలో ఈ వారం సందడి అంటే మహేష్‌బాబుదే అని చెప్పాలి. ‘సర్కారు వారి పాట’ సినిమాతో మే 12న మహేష్‌బాబు థియేటర్లలలో సందడి చేయబోతున్నాడు. ఈ సినిమా కాకుండా మరికొన్ని ఓటీటీ సినిమాలు కూడా ఉన్నాయి. మొత్తం మన దేశంలో ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే సినిమాలేంటో చూద్దాం!
థియేటర్స్‌లో ఇవీ…
* మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. మే 12న సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న చిత్రమిది.
* బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయేశ్ భాయ్ జోర్దార్’. దివ్యాంగ్ ఠక్కర్ తెరకెక్కించిన ఈ సినిమా మే 13న వస్తోంది. భ్రూణహత్యల నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఇందులో ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలిని పాండే కథానాయిక.
ఓటీటీ లెక్క ఇదీ…
* చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. మార్చి 11న విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.250 కోట్లకుపైగా వసూలు చేసింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జీ5లో మే 13 నుండి ప్రసారమవుతుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో సినిమా అందుబాటులోకి రానుంది.
* భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకుల్ని నిరాశపరిచిన విజయ్ సినిమా ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ తెరకెక్కించిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ ఈ వారంలోనే. మే 11న సినిమాను సన్ నెక్స్ట్, నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక నటించిన ఈ సినిమా రూ. 240 కోట్లు వసూలు చేసింది అని చెబుతున్నారు. ఈ సినిమా కూడా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
* అమెజాన్ ప్రైమ్‌లో మే 12న ‘ది మాట్రిక్స్ రెసరెక్షన్స్ మోడర్స్ లవ్’ (తెలుగు), మే 13న ‘మోడర్న్ లవ్ ముంబై’ (హిందీ సిరీస్), ‘వుషు’ (మలయాళం) స్ట్రీమ్ అవుతాయి.
* డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 13న ‘స్నీకరెల్లా’ వస్తుంది. అదే రోజు ఆహాలో ‘కుతుకు పత్తు’ (తమిళం) రిలీజ్ చేస్తున్నారు.
* నెట్‌ఫ్లిక్స్‌లో మే 12న ‘సేవేజ్ బ్యూటీ’ అనే వెబ్ సిరీస్ స్ట్రీమ్ స్టార్ట్ అవుతుంది. జీ5లో మే 13న ‘తాలెదండ’ (కన్నడ), ‘ముగిలిపేట్’ (కన్నడ)న స్ట్రీమ్ అవుతాయి. మే 12న వూట్‌లో ‘ఆదా ఇష్క్’ (హిందీ సిరీస్) తీసుకొస్తున్నారు.
Most Recommended Video
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!