Animal: ‘యానిమల్‌’ సినిమాలో తొలగించిన సన్నివేశాలు, డైలాగ్‌లు ఇవే..!

బోల్డ్‌గా సినిమాలు తీయడం కొందరి స్టైల్‌, వైల్డ్‌గా సినిమాలు తీయడం ఇంకొందరి స్టైల్‌. రెండు సినిమాలకు ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన వస్తూ ఉంటుంది. తొలి రకం సినిమాల సంగతి పక్కనపెడితే… ఇప్పుడు రెండో రకం సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అదే ‘యానిమల్‌’. సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ బాలీవుడ్‌ చిత్రం గురించి ఇప్పుడు దేశం మొత్తం ఎదురుచూస్తోంది. కారణం.. ఆ సినిమా నేపథ్యం, ట్రైలరే. అందులో చూపించిన యాక్షన్‌ సీన్స్‌, హీరో మేనరిజం, యాటిట్యూడ్‌ యూత్‌కు బాగా కనెక్ట్‌ అవుతున్నాయి.

దానికి తోడు సినిమాలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు, రొమాంటిక్‌ సీన్స్‌ కూడా ఉన్నాయి అని వార్తలు వచ్చాయి. వీటన్నింటికి కోసం ఎదురుచూస్తుండగా… సెన్సార్‌ బోర్డు కొన్ని సన్నివేశాలను తొలగించింది అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా కనిపిస్తున్నాయి. వాటి ప్రకారం చూపిస్తే సినిమాలో కీలకం అని చెబుతున్న రొమాంటిక్‌ సీన్లు, కొన్ని డైలాగ్‌లు కూడా కట్‌ అవుతాయి. ‘యానిమల్’లో సెన్సార్ ఐదు సన్నివేశాలను తొలగించింది అనేది లేటెస్ట్‌ చర్చ.

‘యానిమల్’ (Animal) సినిమాలో రణ్‌బీర్, రష్మిక… విజయ్, జోయా అనే పాత్రల్లో కనిపిస్తారు. వారిద్దరి రొమాంటిక్ సీన్స్‌లోని కొన్ని క్లోజప్ షాట్స్‌ను డిలీట్ చేయమని సెన్సార్‌ బోర్డు చెప్పిందట. వాటికి తగ్గట్టుగా మార్పులు చేసి సినిమాను సెన్సార్‌ చేశారట. అలాగే ‘వస్త్ర’ అనే హిందీ పదాన్ని తొలగించి కాస్ట్యూమ్ అనే ఇంగ్లీష్‌లో పెట్టారట. సినిమాలో బూతులు ఎక్కడ వచ్చినా దానికి తగినట్టుగా పదాన్ని మార్చాలి లేదంటే మ్యూట్ చేయమని సెన్సార్‌ బోర్డు ఆదేశించిందట.

ఇక ‘యానిమల్’ సినిమా నిడివి 3 గంటల 21 నిమిషాలు. అంతటి పెద్ద సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేది డిసెంబర్ 1న తేలిపోతుంది. ఆ రోజే ‘యానిమల్‌’ తన విశ్వరూపాన్ని థియేటర్లలో చూపించబోతున్నారు. ‘బ్రహ్మాస్త్ర’తో కాస్త తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న రణ్‌బీర్‌ ఈ సినిమాతో ఏం చేస్తాడో చూడాలి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus