శివరామకృష్ణ మూర్తి మనకి మాత్రం సూపర్ స్టార్ కృష్ణ. 1943 సంవత్సరం మే 31న జన్మించిన ఈయన.. 1965లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1964 కి ముందు ఆయన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించేవారు.. ‘తేనె మనసులు’ మూవీతో తెరంగేట్రం చేసి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాల్లో నటించారాయన. హీరోగానే కాదు.. దర్శకుడిగా, నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు ఆయన. తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత కూడా ఈయనకే చెందుతుంది.
విలక్షణ నటుడిగా కూడా .. ఈయన ఎన్నో సినిమల్లో నటించారు. తన సినిమా ప్లాప్ అయ్యి నిర్మాతకి నష్టాలు వస్తే.. తాను తీసుకున్న పారితోషికంలో సగానికి పైగా ఇచ్చేసి ఆ నెక్స్ట్ సినిమా ఫ్రీగా చేసిపెట్టేవారట కృష్ణ. ఆ సినిమా కూడా హిట్ అయ్యి లాభాలు వస్తే తన పారితోషికం ఇమ్మనేవారట లేదంటే లేదు. ఆయన సినిమా చేస్తాను అని మాట ఇస్తే తప్పకుండా చేస్తారు. ఇదే క్రమంలో ఆయన సినిమా చేస్తాను అని కమిట్ అయిన నిర్మాతల కోసం రెండు సూపర్ హిట్ చిత్రాలను వదులుకున్నారు కృష్ణ.
ఆ సినిమాలు ఏంటో తెలుసా? ఒకటి ‘ఖైదీ’ కాగా రెండోది ‘కలియుగ పాండవులు’. ఈ రెండు సినిమాలు ఆయన కమిట్ అయిన నిర్మాతలకి చేస్తాను అని చెప్పారు. కానీ దర్శకులకి వేరే నిర్మాతలతో కమిట్మెంట్ ఉండడం వలన ఈ ప్రాజెక్టులను కృష్ణ దూరం చేసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ‘ఖైదీ’ ద్వారా చిరంజీవికి….
‘కలియుగ పాండవులు’ ద్వారా విక్టరీ వెంకటేష్ కు లైఫ్ దొరికింది. ఈ ఇద్దరూ ఇప్పుడు స్టార్లుగా రాణిస్తున్నారు అంటే ఆ చిత్రాలు అందించిన విజయాలు కూడా కారణమని వారు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!