Priyanka Chopra,Nick Jonas: స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ కలిగి ఉన్న హీరోయిన్లలో ప్రియాంక చోప్రా ఒకరు కాగా ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిక్ జోనస్ హాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు పాపులారిటీని పెంచుకున్నాడు. ప్రియాంక, నిక్ దంపతులకు ఒక కూతురు కూడా ఉంది. అయితే తాజాగా నిక్ జోనస్ కు చేదు అనుభవం ఎదురు కావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

నిక్ జోనాస్ తన సోదరులతో కలిసి ఒక ఈవెంట్ లో సంగీత కచేరిలో పాల్గొనగా నిక్ జోనాస్ పాట పాడుతున్న సమయంలో కొంతమంది అతనిపై మహిళల లో దుస్తులను విసిరేశారు. అయితే ఊహించని ఘటన ఎదురైనా నిక్ జోనాస్ మాత్రం పాట పాడుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే నిక్ జోనాస్ విషయంలో కొందరు కావాలని ఈ విధంగా ప్రవర్తించడంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిక్ జోనాస్ ఎలాంటి తప్పు చేయకపోయినా నెగిటివ్ కామెంట్లు ఎదురవుతుండటం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది. కళాకారుల గౌరవం దెబ్బ తీసేలా వ్యవహరించడం సరికాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. న్యూయార్క్ లోని యాంకీ స్టేడియంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా ఈ తరహా ఘటనలు పలు సందర్భాల్లో చోటు చేసుకున్నాయి.

కొంతమంది తీరు ప్రముఖ సింగర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. నిక్ జోనాస్ మీడియాతో ఈ ఘటన గురించి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. నిక్ జోనాస్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. (Priyanka Chopra) ప్రియాంక, నిక్ కలకాలం సంతోషంగా ఉండాలని అభిమానులు చెబుతున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus