కమల్ హాసన్(Kamal Haasan) -మణిరత్నం (Mani Ratnam) కాంబినేషన్లో 37 ఏళ్ళ గ్యాప్ తర్వాత వచ్చిన ‘థగ్ లైఫ్’ (Thug Life) చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రన్ ను కొనసాగిస్తుంది.జూన్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. మొదటి రోజు ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. కానీ 2వ రోజు కలెక్షన్స్ తగ్గిపోయాయి. తర్వాత వీకెండ్ ను మినిమమ్ క్యాష్ చేసుకోలేకపోయింది ఈ సినిమా.వీక్ డేస్ కి ఎంటర్ అయ్యాక పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది.
Thug Life Collections:
చాలా ఏరియాల్లో డెఫిసిట్లతో రన్ అవుతుంది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
0.79 cr
సీడెడ్
0.26 cr
ఉత్తరాంధ్ర
0.28 cr
ఈస్ట్
0.11 cr
వెస్ట్
0.08 cr
గుంటూరు
0.16 cr
కృష్ణా
0.20 cr
నెల్లూరు
0.08 cr
ఏపీ+తెలంగాణ టోటల్
1.96 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్)
0.21 cr
టోటల్ వరల్డ్ వైడ్
2.17 cr (షేర్)
‘థగ్ లైఫ్’ కి తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.12.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 6 రోజుల్లో ఈ సినిమా రూ.2.17 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.47 కోట్లు అని చెప్పాలి. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.10.33 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.