Mahesh Babu: మహేష్‌ సినిమా రిలీజ్ అనుకున్నంత ఈజీనా!

అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే… ఈ పాటికి మనం ‘సర్కారు వారి పాట’ టీజర్‌ చూసే ఉంటాం. సినిమా పబ్లిసిటీ కూడా ఫుల్ స్వింగ్‌లో జరుగుతూ ఉంటుంది. కానీ ఓ సినిమా వల్ల అన్నీ మారిపోయాయి. ఆ తర్వాత కరోనా వల్ల ఇంకొన్ని మారిపోయాయి. ఆ విషయం పక్కన పెడితే… ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ కొత్త డేట్‌ మారిపోవడమూ పక్కానే అంటున్నారు. అవును మహేష్ కొత్త సినిమా అనుకున్న కొత్త తేదీ (ఏప్రిల్‌ 1)కి రావడం ఏమంత ఈజీ కాదు అనేది టాలీవుడ్‌ పరిశీలకు మాట. దీని వెనుక కారణం కూడా చెబుతున్నారు.

‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్‌కి ప్రస్తుతం బ్రేక్‌ ఇచ్చారు. చేతికి సర్జరీ జరగడంతో… సినిమా షూటింగ్‌ని వాయిదా వేసి మహేష్‌ ప్రస్తుతం దుబాయిలో రెస్ట్‌ తీసుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని చూస్తున్నారు అని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరిగింది. దీంతో సినిమా అనుకున్నట్లు జనవరి ఆఖరున మొదలవుతుందా అనేది డౌట్‌గా మారింది. గతంలో కరోనా రెండు వేవ్‌ల సమయంలోనూ మహేష్‌ షూటింగ్‌కి హాజరు కాలేదు.

మిగిలిన హీరోలు సినిమాలు స్టార్ట్‌ చేసినా… మహేష్‌ టైమ్‌ తీసుకున్నాడు. దీంతో ఇప్పుడు మూడో వేవ్‌ టైమ్‌లో వస్తాడా అనేది చూడాలి. రెండో విషయం ఒకవేళ మహేష్‌ వచ్చినా… రెండు నెలల్లో సినిమా పూర్తి చేసి, ప్రచారం చేసి ఏప్రిల్‌ 1న విడుదల చేయగలుగుతారా అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఫిబ్రవరి, మార్చి మాత్రమే మిగిలి ఉన్నాయి సినిమా షూటింగ్‌కి. మామూలుగా అయితే ఈ రెండు నెలల్లో సినిమా చేసేయొచ్చు.

అయితే మహేష్‌ లాంటి స్టార్ హీరో సినిమాని అంత వేగంగా చుట్టేసి, పోస్ట్‌ ప్రొడక్షన్‌ చేసేస్తే… ఫలితం తేడా కొడుతుంది. ‘పుష్ప’ ఇలా టైమ్ లేక కాస్త ఇబ్బంది పడ్డారు. దీంతో అనుకున్న సమయానికి ‘సర్కారు వారి పాట’ వస్తుందా అనే ప్రశ్న చర్చకు వచ్చింది. మరి దర్శకుడు పరశురామ్‌ ఏం చేస్తారో చూడాలి. నిర్మాతలైతే ఖర్చుకి వెనకాడదు. ఎందుకంటే అక్కడ మైత్రీ మూవీ మేకర్స్‌.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus