సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా మల్లిక్ రామ్ (Mallik Ram) డైరెక్షన్ లో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ (Tillu Square) మూవీ ఈ నెల 29వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే మెయిన్ ఏరియాలలో ఈ సినిమాకు సంబంధించి బుకింగ్స్ మొదలయ్యాయి. హైదరాబాద్ లో ఈ సినిమాకు బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. సినిమా రిలీజ్ కు మరో 72 గంటల సమయం ఉన్నా బుకింగ్స్ విషయంలో ఈ సినిమా అదరగొడుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టిల్లు స్క్వేర్ నిడివి కేవలం గంటా 58 నిమిషాలు అని తెలుస్తోంది.
2 గంటల కంటే తక్కువ నిడివితో రిలీజ్ కానుండటం ఈ సినిమాకు ప్లస్ కానుందని చెప్పవచ్చు. సినిమాకు టాక్ పాజిటివ్ గా వస్తే మల్టీప్లెక్స్ లలో ఎక్కువ షోలు కూడా ప్రదర్శించే అవకాశం అయితే ఉంటుంది. సితార బ్యానర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఈ సినిమాతో కచ్చితంగా చేరుతుందని అభిమానులు ఫీలవుతున్నారు. టిల్లు స్క్వేర్ సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఆసక్తికర ట్విస్టులతో కథనం ఉంటుందని తెలుస్తోంది.
యాక్షన్, కామెడీ, రొమాంటిక్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని చెప్పవచ్చు. టిల్లు స్క్వేర్ సినిమా నైజాంలో కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టిల్లు స్క్వేర్ రిలీజ్ సమయానికి బాక్సాఫీస్ వద్ద ఇతర సినిమాల హవా తగ్గే ఛాన్స్ ఉంటుంది. టిల్లు స్క్వేర్ మూవీ కోసం సిద్ధు జొన్నలగడ్డ చాలా కష్టపడ్డారని తెలుస్తోంది.
అనుపమ (Anupama Parameswaran) కెరీర్ లో ఈ సినిమా భారీ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విడుదలకు ముందే మంచి లాభాలను అందించిన ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా మంచి లాభాలను అందిస్తుందని నెటిజన్లు ఫీలవుతున్నారు. టిల్లు స్క్వేర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.