SSMB28: మహేష్ – త్రివిక్రమ్ మూవీకి టైటిల్ ఫిక్స్?

మహేష్ బాబు (SSMB28) … త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఉగాది కానుకగా మార్చ్ 22న రివీల్ చేస్తారని అంతా భావించారు. కానీ అలాంటిదేమి జరగలేదు. దీనికి మెయిన్ రీజన్ త్రివిక్రమ్ కు టైటిల్ దొరక్కపోవడం వల్లనే అని తెలుస్తుంది. తర్వాత బాణం సింబల్ పెట్టి మంచి టైంలో టైటిల్ రివీల్ చేస్తామని.. వారు చెప్పుకొచ్చారు. దీంతో శ్రీరామనవమి కానుకగా మార్చి 30న రివీల్ చేస్తారని అంతా అనుకుంటున్నారు.

త్రివిక్రమ్ కి అ తో మొదలయ్యే టైటిల్స్ కావాలి. ‘అయోధ్య లో అర్జునుడు ‘అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ ఈ జెనరేషన్ కుర్రకారుకి అలాంటి టైటిల్స్ ఎక్కవేమో అని వెనకడుగు వేశారు. ఫైనల్ గా ఇప్పుడు ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్ ని ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తుంది. ‘అమరావతి’ టైటిల్ అంటే పొలిటికల్ చర్చలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అంటే మళ్ళీ మహేష్ బాబు..

మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాడా అనే టెన్షన్ అభిమానుల్లో మొదలయ్యే ఛాన్స్ ఉంది. అన్నీ ఎలా ఉన్నా.. ‘అల వైకుంఠపురములో’ టైటిల్ కు ఈ ‘అమరావతికి అటు ఇటు’ టైటిల్ చాలా దగ్గరగా వినిపిస్తుంది. కాబట్టి ఆ సినిమాకు ఇది సీక్వెల్ గా రూపొందుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పైగా ఈ సినిమాకు పనిచేస్తున్న నటీనటులు సాంకేతిక నిపుణులు అంతా కూడా ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి పనిచేసిన వాళ్ళే. అందుకే ఇలాంటి చర్చలు మొదలవుతున్నాయి. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా… పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus