Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమా టైటిల్‌పై దుమారం!

పవన్ కల్యాణ్‌ కొత్త సినిమా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ఇటీవల ఘనంగా ముహూర్తం జరుపుకుంది. అగ్ర నిర్మాతల మధ్య వైభవంగా జరిగిన ఈవెంట్‌లో సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ‘ఉస్తాద్‌’ అనే పేరు ఉంటుందా? అనే ప్రశ్న ఒకటి వినిపిస్తోంది. దీనికి కారణం ఇప్పటికే ఓ సినిమా ‘ఉస్తాద్‌’ పేరుతో మొదలైంది. వారాహి సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పుడు అదే టైటిల్‌ని మెయిన్‌గా తీసుకొని పవన్‌ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌ సినిమా స్టార్ట్‌ చేశారు. దీంతో టైటిల్‌ వార్‌ మళ్లీ మొదలైంది.

ఫ‌ణిదీప్ దర్శకత్వంలో ఆ మధ్య మొదలైన సినిమా దాదాపుగా పూర్తి కావొచ్చింది. కీరవాణి తనయుడు శ్రీసింహా ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. ఇలాంటి సమయంలో పవన్‌ కల్యాణ్‌ సినిమాకు ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌’ అని పేరు పెట్టుకోవ‌డం ‘ఉస్తాద్‌’ టైటిల్‌ని ఇబ్బంది పెట్టడమే అంటున్నారు పరిశీలకులు. దీంతో ఈ విష‌యంలో నిర్మాత సాయి కొర్ర‌పాటి ఛాంబ‌ర్‌కి వెళ్తారా? లేదంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమానే క‌దా అని స‌ర్దుకుపోతారా అనేది ఆసక్తికరంగా మారింది.

టాలీవుడ్‌లో ఇలాంటి టైటిల్ వివాదాలు గతంలోనూ వచ్చాయి. ఇటీవల కాలంలో అయితే ‘గ్యాంగ్ లీడ‌ర్‌’, ‘ఖ‌లేజా’ సినిమాల‌కు టైటిల్ సమస్యలు వచ్చాయి. దాంతో ‘మ‌హేష్ ఖ‌లేజా’, ‘నాని గ్యాంగ్ లీడ‌ర్’ అని మార్చుకోవాల్సి వ‌చ్చింది. మరిప్పుడు ఈ సినిమా విషయంలో ఏం చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా పేరు నిజానికి ‘భగత్‌ సింగ్‌’ అని.. కానీ ఇబ్బందులు రాకుండా ముందు ‘ఉస్తాద్‌’ యాడ్‌ చేశారని కూడా ఓ చర్చ నడుస్తోంది.

గతంలో పవన్‌ కల్యాణ్‌ ఓ సినిమా విషయంలో ఇలాంటి ఇబ్బందే పడ్డారు. ‘కొమురం పులి’ అని సినిమా మొదలుపెట్టి.. విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో వివాదం చెలరేగింది. దీంతో సినిమాను ‘పులి’ అని మార్చారు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో సమస్యను అంతవరకు తెచ్చుకోకుండా ముందుగానే క్లియర్‌ చేసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ఎందుకంటే ఎన్నో రోజుల తర్వాత పవన్‌ – హరీశ్‌ కాంబో మొదలైంది మరి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus